అదిలాబాద్

నిరక్ష్యతరాస్యత వల్లే వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సామాజిక అక్షరాస్యత సదస్సులో కలెక్టర్ జగన్మోహన్
ఆదిలాబాద్, డిసెంబర్ 22: సమాజంలో అసమానతలు, సాంఘిక రుగ్మతలకు నిరక్షరాస్యతే ప్రధాన కారణమని, ఆదిలాబాద్ జిల్లా అక్షరాస్యత లోపం వల్లే ఎంతో వెనుకబడి ఉందని కలెక్టర్ ఎం జగన్మోహన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌టియు భవన్‌లో సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో సిఆర్‌పిలు, ఐఇఆర్‌పిలతో జిల్లాలో చేపట్టిన అమ్మానాన్న చదువు, ఉపాధి కూలీ చదువు, అంగన్‌వాడీ చదువు, వయోజన విద్య కార్యక్రమాలపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ వెనకబాటు తనాన్ని సమూలంగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు అక్షరాస్యత అలవర్చుకొని అభివృద్దికి బాటలు వేయాలని, ముఖ్యంగా మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సిఆర్‌టిలు, ఐఇఆర్‌పిలు ప్రత్యేక శ్రద్దవహించి జిల్లాలోని ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా 90 రోజుల్లో తీర్చిదిద్దాలని సూచించారు. ఏ దేశంలో తల్లిదండ్రులు పిల్లలకు విద్యను అందిస్తారో ఆ దేశాలు మాత్రమే అభివృద్ది చెందాయని అన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికి విద్యలేక పోవడంతో జిల్లా అన్ని రంగాల్లో నష్టపోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కూలీలు, వయోజనలు నిరక్షరాస్యులుగా ఉన్నట్లు గుర్తించామని, వీరందరికి అమ్మానాన్న చదువు, ఉపాధి కూలీ చదువు, అంగన్‌వాడీ చదువు, సాక్షర భారత్ కార్యక్రమాల ద్వారా 90 రోజుల్లో విద్యను అందించి, జిల్లాలో ఉన్న నిరక్షరాస్యతను వంద శాతం అక్షరాస్యతగా తీర్చిదిద్దాలని, అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. సర్వశిక్షా అభియాన్ అధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 233 మంది సిఆర్‌పిలు, 104 మంది ఐఇ ఆర్‌టిలు, ఇతరులను కలిపి మొత్తం 530 మంది సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా పనిచేస్తున్నారని అన్నారు. వీరందరు బాధ్యతతో పనిచేసి జిల్లాలో ప్రస్తుతం ఉన్న నిరక్షరాస్యత శాతం 61 నుండి వంద శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్ది అక్షరాస్యత జిల్లాగా మార్చాలన్నారు. సమావేశంలో ఎపివో శ్రీనివాస్ రెడ్డి, ఎన్‌ఇఆర్‌డబ్ల్యూఎస్ మూర్తి, సిఆర్‌టిలు, ఐఆర్‌పిలు, కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.