కరీంనగర్

సంక్షేమ యూనిట్లు వంద శాతం గ్రౌండింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్, డిసెంబర్ 22: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా మంజూరైన సంక్షేమ యూనిట్లను వంద శాతం గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల లబ్ధిదారులను మండల స్థాయిలో ఎంపిడిఓ, తహశీల్దార్, బ్యాంక్ మేనేజర్ సంయుక్తంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. మంజూరైన యూనిట్లను వంద శాతం గ్రౌండింగ్ చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు పంట రుణాల లక్ష్యం రూ.3980 కోట్లు కాగా, ఇంతవరకు రూ.2165 కోట్లు పంట రుణాలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 1816 మంది కౌలు రైతులకు రూ.5.18 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ట్రైకార్ పథకం క్రింద 665 యూనిట్లకు గాను 453 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని, వికలాంగుల శాఖ ద్వారా 40 యూనిట్లకు 27 యూనిట్లు, స్టెప్‌కార్ ద్వారా 300 యూనిట్లకు 300 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని తెలిపారు. జిల్లాలో కరవు పరిస్థితి ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కోసం 75 మంది రైతులకు పాడి పశువుల యూనిట్లు మంజూరు చేశామని, వీటిని బ్యాంకర్లు 15 రోజుల్లోగా గ్రౌండింగ్ చేయాలని కోరారు. జిల్లాలో రుణాలు తిరిగి చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎజెసి నాగేంద్ర, ఎల్‌డిఎం డిఎ చౌదరి, ఆర్‌బిఐ ఎజిఎం రవీందర్, ఆంధ్రాబ్యాంక్ ఎజిఎం సత్యనారాయణ, ఎస్‌బిహెచ్ చీఫ్ మేనేజర్ మల్లిఖార్జున్ రావు, పలు శాఖల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ రుణాలపై ఎమ్మెల్యే సమీక్ష

పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 22: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి పనులకు కోసం మంజూరైన ఎస్సీ, బిసీ కార్పొరేషన్ సబ్సిడి రుణాలపై బ్యాంకు, మండల పరిషత్ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మండలానికి ఎస్సీ కార్పొరేషన్ కింద 107 యూనిట్లు, బిసీ కార్పోరేషన్ కింద 51 యూనిట్లు మంజూరయ్యాయి. త్వరలో లబ్ధిదారుల ఎంపిక జరగనున్నందున బ్యాంకు, మండల పరిషత్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరికి బ్యాంకు కానుసెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ సబ్సిడి పూర్తి స్థాయిలో వినియోగించాలంటే, బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చేందుకు ముందు కు రావాలని కోరారు. ఈ నెల 24వ తేదీన దరఖాస్తుల గడువు ముగుస్తున్నందున సాధ్యమైనంత తొందరగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు ప్రధాన్యత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎంపిడివో బి.మల్లేశం, ఇవోపిఆర్డీ సత్యనారాయణ, వివిధ బ్యాంకు మేనేర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

చిన్నముల్కనూరులో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన
* ఇద్దరు సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు
చిగురుమామిడి, డిసెంబర్ 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్‌లు మంగళవారం పర్యటించారు. గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లా, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ముల్కనూరులో అక్షరాస్యత సాధింపులో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఈ దుస్థితికి కారణమైన ఇద్దరు సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మండల కో-ఆర్డినేటర్ సత్యవతి సెలవులో ఉండడంతో ముల్కనూరుతో పాటు మండలం మొత్తం మీద సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లు సూపర్‌వైజర్, మండల స్థాయి అధికారులు కలిసి జీతాలు తీసుకుంటున్నారు తప్పా, పర్యవేక్షణ పనులు జరుగడం లేదని, సత్యవతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పనిలో తనకు దగ్గరగా ఉన్న మేట్లతో పనులు చేయించుకొని మిగతా వారికి జాబ్‌కార్డులు ఇవ్వకపోవడం, కూలీల డబ్బులు చెల్లించకపోవడం, అనుచితంగా ప్రవర్తించడం వంటి కారణాలు ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఆరోపణలు రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్ కిషోర్‌ను విధుల్లోనుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్లకు టెండర్లు పిలిచామని, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో తిరిగి టెండర్లను పిలుస్తున్నామని తెలిపారు.