రాష్ట్రీయం

ప్రతి కాలేజీలోనూ 250 సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడికల్, డెంటల్ కాలేజీల ఎన్‌ఓసిల జారీకి కమిటీ
చైర్మన్‌గా జస్టిస్ ఆర్ రామానుజం నియామకం
అనధికార సభ్యులుగా వివేకానంద వర్మ, బాబూరావు

హైదరాబాద్, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు, నో అబ్జెక్షన్ సర్ట్ఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రతి కాలేజీలో కనీసం 250 సీట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రాష్ట్రప్రభుత్వం కోరనుంది. గతంలో జస్టిస్ ఐ పాండురంగారావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ పనిచేసేది. రాష్ట్ర విభజన అనంతరం కమిటీకి ఎవర్నీ చైర్మన్‌గా నియమించలేదు. దాంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, మాజీ లోకాయుక్త జస్టిస్ ఆర్ రామానుజంను చైర్మన్‌గా నియమించింది. కమిటీ సభ్యులుగా వైద్య విద్య సంచాలకుడు, వైద్య విద్య అకడమిక్ విభాగం సంచాలకుడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విసి ఉంటారు. వీరితో పాటు డాక్టర్ వివేకానంద వర్మ(వైజాగ్), డాక్టర్ గడ్డిపాటి బాబూరావు(గుంటూరు), ఎన్ గోవిందరాజ్ కుమార్ (్భమవరం) నాన్ అఫీషియల్ సభ్యులుగా ఉంటారు. ఎంబిబిఎస్, పోస్టు గ్రాడ్యుయేట్, సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు , కొత్త కాలేజీలకు కమిటీ సిఫార్సులు చేస్తుంది. రాష్ట్రంలో వైద్య విద్య కాలేజీలు, సీట్లు, అవసరాలను కూడా కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపుతుంది. అలాగే వైద్య విద్యలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, వచ్చే దశాబ్దానికి అవసరాలు, మెడికల్ కేర్, అందుబాటు,ప్రామాణిక విద్య, సమానత్వం, అందరికీ అవకాశాలు, చౌకగా వైద్యం తదితర అంశాలపై కూడా కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీ అవసరమైన మెడికల్ కాలేజీలను గుర్తించి నో అమ్జెక్షన్ సర్ట్ఫికెట్లు జారీ చేస్తుంది. ప్రతి కాలేజీలో సీట్ల సంఖ్యను కనీసం 250కు పెంచాలని కూడా సిఫార్సు చేయనుంది.