అనంతపురం

వాణిజ్య పన్నుల శాఖ జూనియర్ అసిస్టెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం , మార్చి 15: వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో 1మరియు 2 సర్కిళ్ల పరిధిలో 2011 నుండి 2015 వరకు వసూలు చేసిన వివిధ వాణిజ్య పన్నులకు సంబందించిన చలానాల అవకతవకలు చేసిన నిందితుడు వినాయకను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనంతపురం డియస్పీ మల్లికార్జునవర్మ నిందితుడి వివరాలను విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా డియస్పీ మాట్లాడుతూ 2011 నుండి 2015 వరకు వసూలు చేసిన వాణిజ్య పన్నులను చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించకుండా స్వలాభాలకు వాడుకుని, నకిలీ చలానాలను చెల్లించి అధికారులను మోసం చేసి రూ. 75 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఆ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వినాయకని అరెస్టు చేశామని తెలిపారు. ఇతనితోపాటు ఒప్పందాల మేరకు అనంతపురంలో సేల్స్‌టాక్స్ ప్రాక్టీషనర్‌గా పనిచేసి ప్రస్తుతం పరారీలో ఉన్న జి.నారాయణస్వామి ట్రెజరీ, బ్యాంకు నకిలీ సీళ్లు చలానాలలో ముద్రించి, డబ్బును ఇద్దరు దుర్వినియోగం చేసినట్లు నిందితుడు వినాయక ఒప్పకున్నాడని తెలిపారు. దీంతో వినాయక రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమ చేశాడని, మిగిలిన మొత్తాన్ని కూడా జమ చేస్తానని ఒప్పుకున్నాడని తెలిపారు. దీంతో అరెస్టు చేసిన వినాయకని కేసు పరిశీలన నిమిత్తం రిమాండ్‌కు పంపడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో దర్వాప్తు అధికారి కె.రాఘవన్, ఇతర పోలీసులను డియస్పీ అభినందించారు.