బిజినెస్

జిఎస్‌టిపై సిఇఎ కమిటీ సిఫార్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1 శాతం అదనపు పన్నును తొలగించాలని సూచన

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదంపై నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం పలు సూచనలు చేసింది. రాష్ట్రాల్లో జరిగే అమ్మకాలపై ఒక శాతం అదనపు పన్నును తొలగించాల్సిందిగా సూచించింది. అమ్మకాల పన్ను, సేవా పన్ను, ఎక్సైజ్ పన్ను తదితర పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్‌టిని ప్రభుత్వం తీసుకొస్తున్నది తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ఆరంభం (ఏప్రిల్ 1) నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే లోక్‌సభలో తగిన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో లేకపోవడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పాసవడం లేదు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు కూడా. అంతకుముందు జిఎస్‌టి అమలుతో తాము ఆదాయం కోల్పోతామని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకించినది తెలిసిందే. మరోవైపు పారిశ్రామిక సంఘం ఫిక్కీ.. సుబ్రమణ్యన్ కమిటీ నివేదికను స్వాగతించింది. జిఎస్‌టి అమలుతో భారత వృద్ధిరేటు 2 శాతం పెరుగుతుందని, పరోక్ష పన్నుల విధానంలో పారదర్శకత వస్తుందని పేర్కొంది.