రాష్ట్రీయం

నాకేమీ తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లిప్పింగ్‌ల లీక్‌పై స్పీకర్ కోడెల విస్మయం
విచారణ జరిపిస్తామని వెల్లడి
డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన కమిటీ
హైదరాబాద్, డిసెంబర్ 24: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తూ సభ్యులు సభాకార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. వైకాపా సభ్యులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్లనే వారిని సభ నుండి సస్పెండ్ చేశామని వెల్లడించారు. శాసనసభలో జరిగిన పరిణామాలు తనను ఎంతో ఆవేదనకు గురిచేశాయని అన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దృశ్యాలు చూడలేదని పేర్కొన్నారు. సభలో సభ్యుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని స్పీకర్ చెప్పారు. సభా కార్యక్రమాలకు సంబంధించి వీడియోలు విడుదల చేయాలని తాను ఎవరినీ ఆదేశించలేదని స్పష్టం చేశారు. శాసనసభ సిడిలను తాను అన్ని పార్టీల వారికీ ఇచ్చానని, అయితే అవి రహస్యమా బహిర్గతమా అని మాత్రం ఎవరికీ చెప్పలేదని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే ఆర్ కె రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని కోడెల పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో తనకు తెలియదని, దానిపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలన్న శాసనసభ అభిప్రాయాన్ని తాను ఆమోదించానని చెప్పారు. రోజాకు ఏడాది పాటు సస్పెన్షన్ ఎక్కువా తక్కువా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఒకొక్కరూ ఒక్కోలా చెబుతున్నారని అందుకే ఈ వ్యవహారంపై ఒక కమిటీ వేస్తున్నామని దీనికి డిప్యూటీ స్పీకర్ చైర్మన్‌గా ఉంటారని అన్నారు. మూడు పార్టీల నుండి ముగ్గురు సభ్యులు ఉంటారని తెలిపారు. 18వ తేదీన అసెంబ్లీలో జరిగిన సంఘటనల క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో ప్రసారం కావడం దురదృష్టకరమని అన్నారు. ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని బయటకు ఇవ్వవద్దని ఇది వరకే అధికారులకు చెప్పడం జరిగిందని, కాని అవి ఎలా బయటకు వచ్చాయో తేలాల్సి ఉందని చెప్పారు. సభలో నుండి బయటకు సిడిల రూపంలో లీకై ఉండాలని లేదా ఫోన్లు, ఐప్యాడ్‌లలో రికార్డు చేసి ఉంటారనే అనుమానం కూడా ఉందని, ఈ క్లిప్పింగ్‌లు ఎలా బయటకు వెళ్లాయో తేలాల్సి ఉందని చెప్పారు. కేవలం వెల్‌లో జరిగిన సంఘటనలు మాత్రమేగాక, ఆ రోజు జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్ కావాలని వైకాపా సభ్యులు అడిగారని, వాటిని తాము పరిశీలించి అందజేస్తామని చెప్పామని అన్నారు. తన అనుమతితో బయటకు వెళ్లిన తర్వాత వాటిని వాళ్లే చూసుకుంటారా లేదా బయటపెడతారా అనేది వాళ్ల ఇష్టమని స్పీకర్ అన్నారు. అయితే తాజాగా టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్న క్లిప్పింగ్‌లతో తనకు సంబంధం లేదని స్పీకర్ పేర్కొన్నారు.