తెలంగాణ

షబ్బీర్ అలీ అండ్ కో రూ. 2 కోట్లు తీసుకున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా అడగడంతోనే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకున్నా
ఎఐసిసికి ఫిర్యాదు చేసిన జడ్పీ మాజీ చైర్మెన్ వెంకటరమణారెడ్డి

నిజామాబాద్, జనవరి 2: సొంత పార్టీకి చెందిన ముఖ్య నేతలు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని, మరి న్ని డబ్బులు ముట్టజెప్పాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినందువల్లే తాను ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుండి తప్పుకున్నానని నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ వెంకటరమణారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకటరమణారెడ్డి అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం, ఫలితంగా తెరాస అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి ఎలాంటి పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తెలిసిందే.
ఇలాఉండగా వెంకటరమణారెడ్డి కొంత ఆలస్యంగా స్పందిస్తూ ఎఐసిసి నాయకత్వానికి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తూ లేఖ పంపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎఐసిసి ముఖ్య నేతలకు పంపిన లేఖను ఆయన విడుదల చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తాను ఆశించలేదని, జిల్లాకు చెందిన శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ అనిల్, టి.పిసిసి అధికార ప్రతినిధి మహేష్‌కుమార్ గౌడ్ తదితరులు తనను సంప్రదించి పోటీ చేయాలని సూచించారన్నారు. వారి ప్రతిపాదనకు అంగీకరించానని చెప్పారు. ఈ క్రమంలోనే షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నాయకులు తన వద్ద 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని, నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజు నుండే మరిన్ని డబ్బులు ఇవ్వాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. పైపెచ్చు ఎక్కడ తాను విజయం సాధిస్తానో అనే భయంతో షబ్బీర్ అలీ తెర వెనుక తన ఓటమికి పావులు కదపడం ప్రారంభించారని అన్నారు. షబ్బీర్ అలీ కారణంగానే ఇదివరకు కూడా తాను నష్టపోవాల్సి వచ్చిందని, ఫలితంగా నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయానని పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నింటిని బేరీజు వేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుండి తాను తప్పుకున్నానని స్పష్టం చేశారు. తనకు ఎవరినుండి నయాపైసా ముడుపులు అందలేదని, నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు.
తన వద్ద తీసుకున్న రెండు కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వకపోతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. సొంత పార్టీకి చెందిన అభ్యర్థి నుండి డబ్బులు దండుకుని ఓడిపోయేలా పావులు కదిపిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులపై ఎఐసిసి అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరానన్నారు. ప్రస్తుతానికైతే తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, తనకెలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని వెంకటరమణారెడ్డి తెలిపారు.
ఇలాఉండగా షబ్బీర్ అలీని ఈ ఆరోపణ గురించి ప్రశ్నించగా, పార్టీ నుంచి సస్పెండైన వ్యక్తి చేసే ఆరోపణలపై తాను స్పందించనని అన్నారు.