జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు దక్కని ప్రతిపక్ష హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ: ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవి చూడటంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండా పోయాయి. వాస్తవంగా నిబంధనల ప్రకారం ప్రతిపక్షా హోదా దక్కాలంటే కనీసం 55 మంది సభ్యులు ఉండాలి. గత ఎన్నికల్లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి కాస్తంత పుంజుకున్నప్పటికీ వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఫలితం మాత్రం రాలేదు. ఈసారి 52 సీట్లు సంపాదించి ప్రతిపక్ష హోదాకు సైతం దూరమైంది. ఇకపోతే కొన్ని రాజ్యాగ వ్యవస్థలలో నియామకాలకు ప్రతిపక్ష నాయకుని హాజరు, ఓటింగ్ తప్పనిసరి. కాని కాంగ్రెస్‌కు అది దక్కలేదు. ఉదాహారణకు లోక్‌పాల్, సీబీఐ వంటి సంస్థల్లో నియామకాలకు ప్రతిపక్ష నాయకుని భాగస్వామ్యం తప్పనిసరి. కాని ఈసారి కూడా గతంలో వలే కాంగ్రెస్ నేత ఖర్గేని ఎంపిక బృందాలకు చేర్చినట్లు ఈసారి ఎవరిని చేరుస్తారో వేచి చూడాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఈసారి కూడా కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలు దాదాపు లేనట్లే.