జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు ప్రియాంక సేవలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సారధ్యం బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగిస్తే మేలు అనే అభిప్రాయం ఆ పార్టీలో పలువురు భావిస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి వేరేవారిని ఎన్నుకోవాలని మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించినప్పటికీ సీనియర్లు మాత్రం గాంధీ కుటుంబం వారే ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఆమె అయితే సరిపోతుందని, ఇందుకు వందశాతం న్యాయం చేయగలరని మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ తనయుడు అనిల్ శాస్ర్తీ సైతం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు ఇపుడు దృఢమైన నాయకత్వం చాలా అవసరమని అన్నారు. ఆమెకు అనుచరగణం కూడా అధికంగానే ఉందని అభిప్రాయపడ్డారు.