ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 131 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం డిసిసి అధ్యక్షుడుగా నూతనంగా ఎంపికైన పనబాక కృష్ణయ్య,సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావును కార్యకర్తలు సన్మానించారు. విభజన చట్టంలోని అన్ని అంశాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ మట్టి సత్యాగ్రహం చేస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని రఘువీరా చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందిన వారు పార్టీని వీడినా నష్టం లేదన్నారు. కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉండే వారిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆదరిస్తుందన్నారు. డిసిసి అధ్యక్షుడుగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊహించి నిరుద్యోగులు ఓటు వేస్తే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. న్యాయమైన కోర్కెల కోసం పోరాడుతున్న ఆశావర్కర్లను ఉద్యోగాల్లో నుంచి తొలగించిన చంద్రబాబుకు మహిళల ఉసురు తప్పక తగులుతుందన్నారు. మాజీ మంత్రి పనబాకలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మహావృక్షం లాంటిందని చెప్పారు. పాత రక్తం పోతే కొత్త రక్తం వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒకరి సొంతం కాదని, వ్యక్తులు పోయినంత మాత్రన నష్టం లేదని అన్నారు.