జాతీయ వార్తలు

వికె సింగ్‌ను బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ధర్నా

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్‌ను మంత్రి పదవి నుండి తొలగించాలంటూ కాంగ్రెస్‌తో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు సోమవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో దాదాపు నలభై మంది ఎంపీలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్, సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా, యువ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా తదితరులు దాదాపు అరగంట సేపు మహాత్ముడి విగ్రహం వద్ద నిలబడి ఎన్‌డిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఎంఏ ఖాన్, కెవిపి రామచందర్‌రావు, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు ధర్నాకు హాజరయ్యారు. వికె సింగ్‌ను మంత్రివర్గం నుండి బర్తరప్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దళితుల పట్ల అత్యంత అవమానకరంగా వ్యవహరించిన సింగ్‌ను కేబినెట్ నుంచి తొలగించకపోవడం చూస్తుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదనేది స్పష్టమవుతోందని ఎంపీలు అన్నారు. ప్రధానికి దళితుల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా వికె సింగ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ‘ప్రధాన మంత్రి వౌనం వీడాలి. సింగ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సింగ్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. తమ డిమాండ్‌ను ఆమోదించేంత వరకు వికె సింగ్‌ను పార్లమెంటు ఉభయ సభల్లో బాయికాట్ చేస్తామని వారు వెల్లడించారు. (చిత్రం) వికె సింగ్‌ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు