జాతీయ వార్తలు

రాహుల్ పౌరసత్వంపై స్పీకర్ చర్య వివక్ష కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎథిక్స్ కమిటీకి గుడ్డిగా నివేదించడంపై కాంగ్రెస్ విసుర్లు

న్యూఢిల్లీ, మార్చి 17: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పౌరసత్వానికి సంబంధించిన అంశంపై విచారణను లోక్‌సభ హక్కుల కమిటీకి అప్పగించడాన్ని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ఈ అంశంపై ఎలాంటి ఆలోచన లేకుండా గుడ్డిగా హక్కుల కమిటీకి అప్పగించారని, ఇది కాంగ్రెస్ నాయకత్వంపై, ప్రతిపక్షంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరప్ప మొయిలీ, గులామ్ నబీ ఆజాద్ గురువారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని హక్కుల కమిటీకి అప్పగించాలని గుడ్డిగా నిర్ణయించారని, ఈ నిర్ణయం కాంగ్రెస్ నాయకత్వంపై స్పీకర్‌కున్న వివక్షను బయటపెట్టిందని ఆరోపించారు. ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్‌పై లోక్‌సభలో చర్చ జరగడాన్ని వీరప్ప మొయిలీ ప్రస్తావిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు ఇదొక మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్‌గాంధీ తాను బ్రిటిష్ పౌరుడినని పేర్కొన్నారంటూ బిజెపి ఎంపి ఫిర్యాదు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గత జనవరిలో హక్కుల కమిటీకి అప్పగించారు. బ్రిటన్‌లో ఓ సంస్థను స్థాపించేందుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాహుల్‌గాంధీ బ్రిటిషర్ అని పేర్కొన్నారని సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని బిజెపి ఎంపి మహేష్ గిరి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సీనియర్ బిజెపి నేత ఎల్. కె.అద్వానీ హక్కుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.