రాష్ట్రీయం

కాంగ్రెస్ లెఫ్ట్ టర్న్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామపక్షాలను చేరదీసే వ్యూహం కౌన్సిల్ ఎన్నికల్లో కలిసే పోటీ
ఖమ్మంలో పువ్వాడకు మద్దతు వరంగల్ ఉప ఎన్నికతో మారిన సీన్
హైదరాబాద్, నవంబర్ 30: ఇటీవల వరంగల్ ఉప ఎన్నిక ఫలితం చేదు అనుభవంతో కాంగ్రెస్ తిరిగి వామపక్షాలకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలికి (కౌన్సిల్) జరగనున్న 12 స్థానాల్లో ఒకటి, రెండు స్థానాలను వామపక్షాలకు కేటాయించడం ద్వారా ‘మాజీ’ మిత్రపక్షాలైన వామపక్షాలను చేరదీయవచ్చన్న ఆలోచన చేస్తోంది. అధిష్ఠానం ఆదేశంతో ఢిల్లీకి వెళ్ళిన టి.పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ఈ విషయాన్ని ముఖ్య నేతల ముందు పెట్టి అనుమతి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటా నుంచి కౌన్సిల్‌కు ఖమ్మం నియోజకవర్గం సిపిఐ అభ్యర్థిగా పోటీ చేయనున్న పువ్వాడ నాగేశ్వర రావుకు మద్దతిచ్చేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉంది. అదేవిధంగా సిపిఎంకు నల్లగొండ లేదా ఆ పార్టీ కోరే ఏ స్థానమైనా ఇవ్వాలన్న ఆలోచనకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది.
1984లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన అనంతరం 1985లో మధ్యంతరం ఎన్నికలు వచ్చినప్పటి నుంచి వామపక్షాలు తెదేపాతోనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ వామపక్షాల నేతలను బావలుగా సంబోధించే వారు. 1994లోనూ తెదేపాతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, తమ బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగాయి. 1995లో చంద్రబాబు సిఎం అయ్యేందుకు సహకరించిన వామపక్షాలు, విద్యుత్తు ఛార్జీల పెంపుదలవంటి అంశాలతో విభేదించి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి చేరువై 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. తర్వాత 2009లో మళ్లీ తెదేపా వైపు మొగ్గు చూపి తెరాసతో సహా మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయినా ఆ ఎన్నికల్లో వైఎస్ విజృంభణకు కూటమి కకావికలమైంది. 2014 ఎన్నికలు వచ్చే సరికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారు. వామపక్షాలు లోపాయికారీగా తెరాసతో ఒప్పందం కుదుర్చుకున్నా, ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. సిపిఐ, సిపిఎంలు అసెంబ్లీలో చేరో స్థానాన్ని దక్కించుకున్నాయి. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న వామపక్షాలకు తెదేపాతో కలిసి పని చేసేందుకు అవకాశం లేదు. కారణం తెదేపాతో బిజెపితో జతకట్టడమేనని చెప్పాలి. వామపక్షాలు మొక్కవోని ధైర్యంతో వరంగల్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను పోటీ చేయించాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. దీంతో 10 వామపక్షాలు తమ అభ్యర్థిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్‌ను పోటీ చేయించగా, ఘోరంగా పరాజయం చెందారు.
ఈ దశలో వామపక్షాలను కలుపుకుని పోవాలన్న ఆలోచనకు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు వచ్చారు. పరస్పరం సహకరించుకుంటే తప్ప తెరాసను ఎదుర్కొనేందుకు బలం సరిపోదన్న భావనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నుంచి మళ్లీ మిత్రత్వం పునఃప్రారంభించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ బాట వేసింది. ఈ బాటలోకి వామపక్షాలను తెప్పించుకుని చేరదీయాలని భావిస్తోంది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా రాబోయే 2019 ఎన్నికల నాటికి బలీయంగా మారవచ్చని, అప్పటి వరకు మిత్రులతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయవచ్చని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆశిస్తున్నారు.