సబ్ ఫీచర్

రాజ్యాంగం మీద రాజకీయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బారత రాజ్యాంగం సమగ్రంగానే వుంది. దానిలో స్వేచ్ఛ, పౌర హ క్కులు, సమానత్వ సూత్రాలు పటిష్టంగానే వున్నాయి. ఫ్రెంచి విప్లవాన్ని ఉత్ప్రేరితం చేసిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే త్రి సూత్రాల స్ఫూర్తి మరింత వనె్నతేరి, రాజ్యాంగాన్ని విస్తృతం చేసాయి. హక్కుల పత్రమైన బ్రిటిష్ ‘మేగ్నాకార్టా’ను మించి వుంది. అమెరికాలో ‘లిబర్టీ విగ్రహం’ కంటే దృఢంగా వుంది. అయితే, రాజ్యాంగమెంత సమగ్రమైనదైనా కూడా దాన్ని అమలుపరచవలసిన ప్రభుత్వ యంత్రాంగం, గౌరవించి అనుసరించవలసిన ప్రజల యొక్క జాతీయ భావం, నిబద్ధత, నైతికతలపై ఫలితం ఆధారపడి వుంటుంది. డా.అంబేద్కర్ కూడా ఇదే విజయాన్ని స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగం అమలు విధానంపై వ్యక్తిగత, వర్గగత, ప్రాంతీయ ప్రయోజనాల ఒత్తిడి పడకూడదు. విస్తృతమైన జాతీయ ప్రయోజనం లక్ష్యంగా అమలుచేయబడాలి. ప్రభుత్వాన్ని నిర్వహించే నాయకులు, మేధావులు, న్యాయశాస్త్ర నిపుణులు ఏకజాతి దృక్పధంతోనే రాజ్యాంగాన్ని వీక్షించాలి.
భారత రాజ్యాంగ రచన, అమలుకొరకు జరిగిన కృషి విస్మృత చరిత్రకాదు. దాపరికమేమీ లేదు. అంతా పారదర్శకంగానే జరిగింది. 1931లో జరిగిన కరాచీ కాంగ్రెస్ మహాసభకు సర్దార్‌వల్లభాయ్ పటేల్ అధ్యక్షులు. ఆ సమావేశంలో, నవభారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని నిర్ణయించారు. నేటి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు అదే ప్రాతిపదిక! 1935 నాటి బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ప్రకారం, 1946లో జరిగిన ఎన్నికల్లో 8 ఫ్రావిన్సులలో కాంగ్రెసు అధికారంలోకొచ్చింది. 1946 సెప్టెంబర్ 2వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వాన తాత్కాలిక జాతీయ ప్రభుత్వమేర్పడింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్తుకు డా.రాజేంద్రప్రసాదు, జవహర్‌లాల్‌నెహ్రూ,వల్లభాయ్‌పటేల్, డా.అంబేద్కర్, ప ట్ట్భా సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, కె.ఎమ్.మున్షీ, దక్షిణాది నుండి కొందరు న్యాయశాస్త్ర కోవిదులైన వారూ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1946 డిసెంబర్ 11వ తేదీన ఈ సభ్యులంతా డా.రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ పరిషత్తు 1946 డిసెంబర్ నుండి 1949 వరకూ అనేకసార్లు సమావేశమయ్యారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య రా జ్యాంగాల్లో ముఖ్యమైన వాటిని వీరు అధ్యయనం చేసారు. చర్చించారు. భారతదేశ ఆర్థిక, సామాజిక, భౌగోళిక పరిస్థితులకనుగుణంగా వీరు రాజ్యాంగ పాఠాన్ని తయారుచేసారు.
ఆ తర్వాత డా.అంబేద్కర్‌తో సహా ఏడుగురు న్యాయ శాస్త్ర నిపుణులతో రాజ్యాంగ డ్రాఫ్టు కమిటీ (ముసాయిదా)ని ఏర్పాటుచేసారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా డా.అంబేద్కర్‌ను నియమించారు. అంతకుముందు పరిషత్ సభఉయలంతా కలిసి చర్చించి ఏర్పరిచిన రాజ్యాంగ పాఠాన్ని ఈ కమిటీవారు, చట్టం విభాగాలు, అధికరణలు, షెడ్యూల్సు మొదలైన రూపాల్లో చక్కని రాజ్యాంగంగా రచించారు. ఇలా తయారైన డ్రాఫ్టు రాజ్యాంగ ప్రతిని 26 నవంబర్, 1949వ తేదీన, రాజ్యాం గ పరిషత్తు అధ్యక్షులైన డా.రాజేంద్రప్రసాద్‌కు సమర్పించారు. ఈ రాజ్యాంగ ప్రతిని పార్లమెంటు ఆమోదించింది. ఈ కొత్త రా జ్యాంగం 26, జనవరి 1950వ తేదీనుండి అమల్లోకి వస్తుందని తీర్మానించారు. అందువలన, 15 ఆగస్టు 1947వ తేదీన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కూడా, 1950నాడే అమల్లోకొచ్చింది. అందువలన, జనవరి 26వ తేదీనే ‘రిపబ్లిక్ డే’, ‘రాజ్యాంగ దినం’గా ఈ 65 ఏళ్ళనుండే మనం పరిగణిస్తున్నాం.
కాని కేంద్రంలో ఇపుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, 65 ఏళ్ళ తర్వాత, నవంబర్ 26వ తేదీని ‘రాజ్యాంగ దినం’గా ప్రకటించింది. ప్రతి సంవత్సరం అదే రోజున రాజ్యాంగ దినం జరుపుకోవాలని తీర్మానించింది. ఈ నిర్ణయం ప్రజల్లో సందిగ్ధతను రేపుతోంది. ఇంతవరకూ భావిస్తున్న విధంగా, రాజ్యాంగ దినం జనవరి 26వ తేదీయా, లేక ఇప్పుడుంటున్న విధంగా నవంబర్ 26వ తేదీయా? లేక రెండూనా? ఇంత కాలం గడిచాకా, ఇప్పుడిలా నిర్ణయించవలసిన అవసరం ఎందుకు కలిగిందీ అనేది సమాధానం లేని ప్రశ్న.
ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం గా తెలుసుకోవాలి. 15 ఆగస్టు 1947న స్వా తంత్య్రం వచ్చినప్పటికీ, 26 జనవరి 1950వరకూ రాజ్యాంగం అమల్లోకి రాలేదు కనుక, ఈమధ్యకాలంలో ఏ చట్టాలననుసరించి స్వతంత్ర భారత ప్రభుత్వం పాలన సాగించింది! రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక, బ్రిటన్‌లో ఎన్నికలు జరిగాయి. చర్చిల్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోయి, లేబర్ పార్టీ అధికారంలోకొచ్చింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ‘్భరత స్వాతంత్య్ర చట్టం’ (ఇండియన్ ఇండిపెండెన్స్ ఏక్ట్) ను బ్రిటిష్ పార్లమెంటులో పెట్టి పాస్ చేసారు. ఆ చట్టంలోని విధి విధానాల ప్రకారమే, 1947 నుండి 1950 వరకూ స్వతంత్ర భారత పాలన జరిగింది. అంతేకాని, కొత్త రా జ్యాంగం ప్రకారం కాదు. అందుకే, స్వాతం త్య్రం తరువాత కూడా, లార్డ్‌వౌంట్ బాటన్ వైస్‌రాయ్‌గా వున్నారు. ఆయన తర్వాత, మొదటి భారతీయ గవర్నరు జనరల్‌గా సి.రాజగోపాలాచారి 26, జనవరి 1950 వర కూ వున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి, డా.రాజేంద్రప్రసాద్ భారతదేశ మొద టి రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. అందువలన, జనవరి 26వ తేదీని ‘రిపబ్లిక్ డే’గా రాజ్యాంగ దినంగా పరిగణిస్తూ వస్తున్నాం.
అయితే, నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినంగా ప్రకటించడంలో ఇప్పటి ప్రభుత్వ ఉద్దేశమేమిటి? రాజ్యాంగ పరిషత్తు ఏర్పడిన నాటినుండి 26,జనవరి 1950 వరకూ రాజ్యాంగ తయారీ ప్రక్రియ కొనసాగింది. ఈమధ్యలో అనేక ఘట్టాలున్నవి. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షునికి ముసాయిదా ప్రతిని నవంబర్ 26వ తేదీన అందజేయడం ఈ ఘాట్టాల్లో ఒకటి మాత్రమే! రాజ్యాంగ పరిషత్తు ఏర్పడడం, అధ్యయనం, చర్చ, రచన లాంటిదే ఈ ఘట్టం కూడా! అంత మాత్రాన, ఈ తేదీని రాజ్యాంగ దినంగా ప్రకటించడమేమిటి? స్వాతంత్య్రోద్యమ నాయకుల్ని, అపుడు రాజ్యాంగ రచన చేసిన మహానాయకుల్ని ఏదో ఒక పార్టీకి చెందిన వారిగా పరిగణించ కూడదు. వారు జాతి అంతటికీ చెందిన జాతీయ నాయకులు! ‘్భరతరత్న’ బిరుదులు వారికిచ్చినా, ఇవ్వకపోయినా, ఆ బిరుదుకంటే వారు అధికులు! ఇష్టమైన విధంగా చరిత్రను వ్రాయడం సాధ్యం కావచ్చును. కాని, గతించిన చరిత్రను చెరిపివేయడం మాత్రం ఎవరికీ సాధ్యంకాదు. చరిత్ర అంటే గతంలో జరిగిన వాస్తవం!

- మనె్న సత్యనారాయణ