రాష్ట్రీయం

సమన్వయమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రచందనం, తీవ్రవాదంపై ప్రత్యేక దృష్టి
కేంద్రం నుంచి అదనపు బలగాలు
నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్
దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్లో నిర్ణయాలు

విజయవాడ, డిసెంబర్ 12: అంతర్ రాష్ట్రా మధ్య నానాటికీ సమస్యగా తయారవుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాతోపాటు తీవ్రవాదుల కార్యకలాపాలను అణచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన శనివారం నాడిక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పైరెండు సమస్యల పరిష్కారానికి కేంద్రం అదనపు పోలీసు బలగాలను పంపించాలని, అందుకయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు కోరగా రాజ్‌నాథ్‌సింగ్ సూత్రప్రాయంగా అంగీకరించారు. 2012 తరువాత నేడు జరిగిన సమావేశంలో అనేక నిర్ణయాలపై చర్చలు జరిగాయి. ఇకనుంచి ఏటా తప్పకుండా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, వచ్చే ఏడాది కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో భేటీ కావాలని కూడా నిర్ణయించారు. సౌత్‌జోన్ సమావేశానికి తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల ప్రతినిధులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని సిఎం చంద్రబాబు, తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కోరారు. మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలతో సరిహద్దు సమస్యలు అనేకం ఉన్నందున సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోడానికి దీనివల్ల అవకాశం లభిస్తుందన్నారు. ముందుగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలను తరచూ నిర్వహిస్తుంటే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. సరిహద్దు సమస్యలపైనే కాకుండా కొన్ని కీలకమైన అంతర్గత సమస్యలపైనా ఇరుగుపొరుగు రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కారానికి సిద్ధమైతే కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరించగలదని హామీ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభా స్థానాల సంఖ్య పెంచాలని కోరగా, దీనికి కూడా రాజ్‌నాథ్ సూత్రప్రాయంగా అంగీకరించారు. సిఎం చంద్రబాబు మాట్లాడుతూ అడ్డగోలుగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర అనేక ఇబ్బందులు పడుతుందంటూ, ఇలాంటి కీలకమైన సమావేశాన్ని కూడా హోటల్‌లో నిర్వహించుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగుళూరు- అమరావతి- హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్, చెన్నై- అమరావతి- విశాఖ మధ్య ఇండస్ట్రీ కారిడార్, విశాఖ- చెన్నైమధ్య కోస్టల్ కారిడార్‌కు కేంద్రం సహకరించాలని కోరారు. కోస్తాతీరంలో గస్తీ ముమ్మరం చేసేందుకు కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మత్స్యకారులు రాష్ట్ర సరిహద్దులు దాటినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున బయో మెట్రిక్ కార్డులు అందించేందుకు సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాలను కలుపుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. పోలవరం ముంపు మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగేందుకు కేంద్రం తక్షణం అనుమతి మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో చంద్రబాబుతోపాటు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, కర్నాటక హోంమంత్రి పరమేశ్వర, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్‌కుమార్ సెవాంగ్, తమిళనాడు ఆర్ధికమంత్రి పన్నీర్‌సెల్వం, కేరళ మంత్రి జోసఫ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డిజిపి జెవి రాముడు పాల్గొన్నారు.