బిజినెస్

అంతంతమాత్రంగా కీలక రంగాల పనితీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత వౌలిక రంగం పనితీరు ఈ ఏడాది అక్టోబర్ నెలలో 3.2 శాతంగా నమోదైంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇది 9 శాతంగా ఉండటం గమనార్హం. ముడి చమురు, ఉక్కు, బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులను కీలక రంగాలుగా పరిగణిస్తుండగా, దేశ జిడిపిలో వీటి వాటా దాదాపు 38 శాతంగా ఉంది. అయతే బొగ్గు ఉత్పత్తి ఈ అక్టోబర్‌లో గతంతో పోల్చితే 16.4 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోవడం గమనార్హం. ముడి చమురు, సహజ వాయువు, ఉక్కు రంగాల్లోనైతే ఉత్పత్తి వరుసగా మైనస్ 2.1 శాతం, మైనస్ 1.8, మైనస్ 1.2 శాతంగా నమోదైంది. రిఫైనరీ ఉత్పత్తుల్లోనూ ఇది మైనస్ 4.4 శాతంగా నమోదైంది. అయతే ఎరువులు, సిమెంట్ రంగాల పనితీరు మాత్రం వరుసగా 16.2 శాతం, 11.7 శాతంగా నమోదైంది. విద్యుత్ రంగంలో కాస్త తగ్గినా 8.8 శాతంగా నమోదైనట్లు సోమవారం గణాంకాలు చెబుతున్నాయ.

ఈసారి జిడిపి వృద్ధిరేటు మరింత పెరుగుతుంది: జైట్లీ
న్యూఢిల్లీ, నవంబర్ 30: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2014-15) నమోదైన 7.3 శాతం కంటే అధికంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉత్పాదక రంగం మంచి పనితీరును కనబరిచిందని, 9.3 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందన్నారు. సోమవారం భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన జిడిపి వృద్ధిరేటుపట్ల ఆనందం వ్యక్తం చేశారు. 7.4 శాతంగా నమోదవడం ఆహ్వానించదగినదన్నారు. ఏప్రిల్-జూన్‌లో నమోదైన 7 శాతం కంటే అధికంగా ఉండటం ప్రభుత్వ చర్యల సత్ఫలితాలకు నిదర్శనంగా పేర్కొన్నారు అరుణ్ జైట్లీ.

ఏప్రిల్-అక్టోబర్‌లో 74 శాతానికి చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి ఏడు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలో 74 శాతానికి చేరింది. ఈ ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో 4.11 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్-అక్టోబర్‌లో నమోదైన ద్రవ్యలోటుతో పోల్చితే సోమవారం నాటి గణాంకాలు తక్కువగానే ఉన్నాయి. నాడు 89.6 శాతంగా ద్రవ్యలోటు నమోదైంది. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్యనున్న వ్యత్యాసాన్ని ద్రవ్యలోటు అంటున్న విషయం తెలిసిందే. ఈ ద్రవ్యలోటును 5.55 లక్షల కోట్లకు కట్టడి చేస్తామని కేంద్రం తమ బడ్జెట్ అంచనాలో లక్ష్యం గా పెట్టుకుంది. ఇదిలావుంటే పన్నుల ఆదాయం ఈ ఏప్రిల్-అక్టోబర్‌లో 4.28 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం 9,19, 842 కోట్ల రూపాయలుగా ఉంటుందని బడ్జెట్ అంచనా. అలాగే మొత్తం వ్యయం 10.21 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.

అక్టోబర్-సెప్టెంబర్‌లో 32.87 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ
న్యూఢిల్లీ, నవంబర్ 30: గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 32.87 బిలియన్ డాలర్లు వచ్చాయి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సేవా, వాణిజ్య, ఆటోమొబైల్, నిర్మాణ, రసాయనాలు, విద్యుత్, ఔషధ, పారిశ్రామిక యంత్రాలు, ఆహార తయారీ రంగాల్లోకి ఈ విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చెప్పారు. కాగా, గత ఏడాది అక్టోబర్, ఈ ఏడాది ఏప్రిల్ మధ్య ఎఫ్‌డిఐ 48 శాతం పెరిగినట్లు మంత్రి పార్లమెంట్‌కు తెలియజేశారు.

మార్చి నాటికి ఖాయిలా పరిశ్రమలు 5.37 లక్షలు: గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ, నవంబర్ 30: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లో (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ) ఈ ఏడాది మార్చి నాటికి 5.37 లక్షల యూనిట్లు ఖాయిలాపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 5,37,286 ఎమ్‌ఎస్‌ఎమ్ పరిశ్రమలు ఖాయిలా పడ్డాయని సోమవారం పార్లమెంట్‌కు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే సమస్యల్లో ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలను ఆదుకునేందుకు చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. కాగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (84,063), గుజరాత్ (49,383), మహారాష్ట్ర (49,293), కర్నాటక (38,277) రాష్ట్రాల్లో ఖాయిలా పరిశ్రమలున్నాయి.