కర్నూల్

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఉచిత వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 1: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ఎన్‌టిఆర్ ఉచిత వైద్య సేవలు అని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో 60 రకాల ఉచిత వైద్య పరీక్షల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ -2 రామస్వామి, డిఎం అండ్ హెచ్‌ఓ రాజా సుబ్బారావు, జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి కో- ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల చైర్ పర్సన్ దేశం సులోచన ఆధ్వర్యంలో వ్యాధి నిర్థారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు (10)ని ఆయన ప్రారంభించారు. అలాగే 102 కాల్ సెంటరును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆసుపత్రి ఒక ఆలయం లాంటిదని, ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండ 60 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. దీంతోపాటు టెలి రేడియాలని విధానంలో ఎక్స్‌రే, స్కానింగ్‌తోపాటు అన్ని పరీక్షలు ఉచితంగా అందిస్తామన్నారు. ఆసుపత్రిలో ఏవైన యంత్రాలు చెడిపోతే వెంటనే 24 గంటలల్లోపు మరమ్మతులు పూర్తి చేసి వైద్య సేవలకు ఆటంకం లేకుండ చూస్తారన్నారు. గర్భిణులు పురుడు వరకు అన్ని రకాల వైద్య సేవలు అందజేయడమేకాకుండ కాన్పుకోసం 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పిస్తున్నారని, అలాగే కాన్పు అయిన అనంతరం తల్లీబిడ్డను క్షేమంగా తమ ఇంటికి చేర్చేందుకు 102 వాహనాలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. సుఖమైన ప్రసవం నిర్వహించేందుకే ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తుందన్నారు. గర్భవతులు గర్భందాల్చినప్పటి నుండి సుఖ ప్రసవం చేయడంతో పాటు పిల్లలకు కావాల్సిన టీకాలు అన్ని వేయించి సురక్షితంగా వారి ఇంటికి పాకెట్ మణి (రూ.వెయ్యి) ఇచ్చి పంపే ఏర్పాట్లను ప్రారంభిమచామన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవల పథకంలో భాగంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండ వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించి తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చామన్నారు. పుట్టిన ప్రతి శిశువు రోగాల బారిన పడి మృతి చెందకుండ అన్ని రకాల సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్‌టిఆర్ వైద్య సేవల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ పథకాన్ని ప్రారంభించారని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనవరి 1వ తేదీన ఎన్‌టిఆర్ వైద్య సేవల పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కొత్త సేవలను ప్రారంభించామన్నారు. పేద వారికి తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం రూ.12 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, టెండర్లు కూడా పూర్తి చేశామని పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. శ్రీశైలంలో వంద పడకల ఆయుర్వేద ఆసుపత్రికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు రోగులను శ్రద్ధతో చూడాలని, ప్రతి చిన్న విషయానికి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయరాదని, అలాగే బయట మందులు కొనుగోలు చేయాలని సూచించరాదని, అదేవిధంగా రోగులను తమ ప్రైవేటు డిస్పెన్సరీకి రమ్మని చెప్పరాదని, ఇలాంటివి ఏదైనా తమ దృష్టికి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు వెనుకాడబోమన్నారు. ఈకార్యక్రమంలో మెడాల్ ఏజెన్సీ సిఇఓ గుప్త, మెడికల్ సూపరింటెండెంట్ విజయకుమార్, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ సిద్దం శివరాం, కౌన్సిలర్ దేశం సుధాకర్‌రెడ్డి, శంకర్, అనిల్ అమృతరాజ్, జాకిర్, శోభారాణి, జగదీశ్వర్‌రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.