శ్రీకాకుళం

‘కార్పొరేషన్’ కిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 11: రాష్ట్రంలోని కొన్ని చోట్ల జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా కార్పొరేషన్ స్థాయికి తగ్గట్టుగా కనీసం 15 బార్ అండ్ రెస్టారెంటులు ఉండాలన్న సంస్కరణలతో నూతన బార్ విధానానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలను సమగ్రాభివృద్ధి చేస్తానంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకే కొత్త బార్ విధానంలో కూడా సిక్కోల్ వాటా కార్పొరేషన్ పరిధి మేరకు కేటాయించాలన్న అంశాన్ని కూడా సరికొత్త పాలసీలో పొందుపర్చినట్టు రాజధాని వర్గాల సమాచారం.
బార్లు వాటాలో సిక్కోల్ కార్పొరేషన్‌కు ఆరు బార్లు అధనంగా కేటాయించే అవకాశం ఉన్నట్టు కన్పిస్తోంది. దీంతో శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఇప్పటి వరకూ నడుస్తున్న తొమ్మిది బార్లుకు రానున్న కార్పొరేషన్ కానుకతో 15 బారులుగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో ఒకటి, ఆమదాలవలసలో ఒకటి, రాజాంలో నాలుగు బారులతోపాటు శ్రీకాకుళం మున్సిపాలిటీలో తొమ్మిది బార్లు నడుస్తున్నాయి. కొత్త బారుకు రెండు లక్షల రూపాయల దరఖాస్తు రుసుం చెల్లించాల్సివుంటుంది. కేవలం పదివేల రూపాయలకే దరఖాస్తు చేసుకునే పరిస్థితుల్లో గల శ్రీకాకుళం మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఎదుగుదలతోపాటు ఇరవై రెట్లు అదనం దరఖాస్తు రుసుం పెరగనుంది. గతంలో కేవలం 150 చ.మీ. విస్తీర్ణం గతంలో బార్ కోసం సరిపోతుందంటూ అందులో కిచెన్ లేకపోయినా, పార్కింగ్ ఉండకపోయినా, బల్లలు, కుర్చీలు ఉంటే చాలన్నట్టుగా బార్లుకు అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు కార్పొరేషన్ రేటింగ్‌లో అవన్నీ కుదరని పని. 200 చ.మీ. తప్పనిసరిగా ఉండాల్సిందే. అందులో 15 చ.మీ. వంటగది కోసం కేటాయించాల్సిందే. పోటీపడి ఒకే బార్ కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలైతే డ్రా పద్ధతి ఉండనే ఉంది. అదే కార్పొరేషన్‌లో కొత్త బార్ విధానానికి కొసమెరుపు. డ్రా పద్ధతిలో తొలిసారిగా బారులు కేటాయించడం శ్రీకాకుళం కార్పొరేషన్‌కు దక్కిన ఘనత. సిక్కోల్ జిల్లా అంటేనే అన్నీంటా ప్రత్యేకత కన్పిస్తుండడం ఆనవాయితీ. అలాగే, కొత్త బారు విధానంలో కూడా తొలిసారిగా కార్పొరేషన్‌గా అవతారమెత్తిన సిక్కోల్ ద్వారా సర్కార్ ఆదాయవనరులు పెంచేందుకు సహకారం అందించడంలో కూడా ప్రత్యేక పాత్ర సంతరించుకుందనే చెప్పాలి. జనాభా ప్రాతిపదికపై బార్లు మంజూరు చేయడం అబ్కారీ పాలసీ. కానీ, సిక్కోల్ కార్పొరేషన్ వరకూ వచ్చేసరికి కేవలం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా స్థాయి పెంచేందుకు అయ్యేందుకే ఆరు బార్లు అదనంగా వస్తున్నాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీలో 1.49 లక్షల జనాభా ఉంది. ప్రతీ చదరపు కిలో మీటర్‌కు అయిదు వేల జనాభా ఉంటే కార్పొరేషన్ చేయవచ్చునంటూ కడపను కార్పొరేషన్‌గా మార్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పెట్టిన సంస్కరణ. అదే సంస్కరణలతో సిక్కోల్ మున్సిపాలిటీని జనాభా పెంచకుండా, శివారు పంచాయతీలు విలీనం చేయకుండానే 36 వార్డులతోనే కార్పొరేషన్‌గా మార్చేసినట్టు ఇటీవలే ప్రభుత్వం జి.వో.267ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత శ్రీకాకుళం కార్పొరేషన్ జనాభా 1.49 లక్షలు. జనాభా ప్రాతిపదికగా బార్లు కేటాయింపులు చేస్తే కేవలం మూడు మాత్రమే మంజూరవుతాయి. కానీ, అబ్కారీ ఉన్నతాధికారులు కార్పొరేషన్‌కు ప్రత్యేక ‘కిక్’ ఉండాలంటూ సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రతీ స్కేర్ మీటర్‌కు 5000 నుంచి 8000 వరకూ శ్రీకాకుళంలో జనాభా ఉండడంతోనే కార్పొరేషన్ ప్రతిపాదనలకు సర్కార్ సై చెప్పింది. అదే ఫార్ములాతో స్కేర్ కి.మీటర్ల లెక్కన బార్లు కేటాయింపులు చేసే సంస్కరణకు రాష్ట్ర అబ్కారీబాసులు తెరలేపారు. దీంతో సరికొత్తగా ఆవిర్భావం జరిగిన శ్రీకాకుళం కార్పొరేషన్‌కు జనాభా ప్రాదిపదికపై కాకుండా, స్కేర్ కి.మీ. లెక్కన 14.10 స్కేర్ కి.మీ. విస్తీర్ణం కలిగిన సిక్కోల్ కార్పొరేషన్‌కు 14 బార్లు ఉండాలన్న నివేదికలకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా కేంద్రంలో 15 బార్లుతోపాటు రాజాం మున్సిపాలిటీగా స్థాయి పెరగడంతో కావడంతో అక్కడ ప్రస్తుతం ఉన్న నాలుగు బార్లతోపాటు మరో నాలుగు అదనంగా పెరిగే అవకాశం ఉంది.
ఆమదాలవలసలో నాలుగు(అదనంగా మూడు బార్లు), ఇచ్ఛాపురంలో అదనంగా రెండు అంటే మూడు బార్లు, పలాసలో కొత్తగా రెండు బార్లకు అబ్కారీశాఖ మంజూరు చేసే అవకాశం ఉండవచ్చునంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. ఇదే పెరుగుదలతో జిల్లా అంతటా 17 బార్లు అదనంగా వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే, జిల్లాలో మొత్తంగా ప్రస్తుతం నడుస్తున్న 15 బార్లు ఒక్కసారిగా 32గా పెరిగిపోయే అవకాశం కన్పిస్తోంది. అయితే, ఫీజుల మోత బార్ల గేట్లు తెరుచుకునేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చునంటూ మద్యం వ్యాపారులు చెబుతున్నారు.