హైదరాబాద్

ఆగని అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: మహానగర పాలక సంస్థలో అవినీతికి తావులేకుండా ప్రజలకు పారదర్శకంగా సేవలందించే దిశగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు జిహెచ్‌ఎంసిలోని అక్రమార్కులైన అధికారులు తమ పనులు తాము చేసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోతున్నారు. కార్పొరేషన్‌కు రోజురోజుకీ ఆదాయంతో పాటు అవినీతి పెరుగుతూనే ఉంది. అవినీతితో అప్రతిష్ట పాలైన జిహెచ్‌ఎంసిలో అధికారులు, సిబ్బంది పనితీరులో పారదర్శకత సాధించేందుకు అధికారులు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, అవినీతికి ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ ఏటా వరుసగా నలుగురు బల్దియా అధికారులు ఏసిబికి పట్టుబడటం ఇందుకు నిదర్శనం. ఇపుడు తాజాగా చందానగర్ సర్కిల్ కార్యాలయాంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న పీరంసింగ్ కూడా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణతో ఏసిబికి చిక్కారు. ఏకకాలంలో ఆయన ఆఫీసులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసిబి అధికారులు గురువారం సాయంత్రం వరకు రూ. 8 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. ఇంతకు ముందు కూడా ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో రాజేందర్ అనే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, ఆ తర్వాత సర్కిల్ ఏడులో అసిస్టెంటు మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేసిన శివకుమార్ ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగంలో శివానంద్ అనే ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది నెలలకే చందానగర్ డిఇఇ పీరంసింగ్ ఎసిబి అధికారులకు పట్టుబడటంతో ఇప్పటి వరకు అవినీతిని రూపుమాపేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదని చెప్పవచ్చు. జిహెచ్‌ఎంసిలోని టౌన్‌ప్లానింగ్, మెడికల్, హెల్త్, ఇంజనీరింగ్, ట్యాక్సు విభాగాలకు చెందిన సిబ్బందే ఎక్కువ మంది ఏసిబి అధికారులకు పట్టుబడుతున్నారు. అధికారులు ఆయా విభాగాలను ప్రక్షాళన చేసే అంశంపై దృష్టి సారించటం లేదు. ఇందుకు గ్రేటర్‌లో అవినీతి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండటమే కారణమన్న వాదన ఉంది. ఉన్నతాధికారులే పరోక్షంగా అవినీతిపరులను, అక్రమార్కులకు ముఖ్యమైన పదవులను కేటాయిస్తూ వారి ద్వారా అడ్డదారిలో అధిక మొత్తం సంపాదిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.