కర్నూల్

పత్తికొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం
కర్నూలు , నవంబర్ 20: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారని, అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఉలిందకొండ, వెల్తుర్తి, ఓర్వకల్లు, నందికొట్కూరు, అలంపూర్, ఐజ, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు తదితర ప్రాంతాల నుంచి పత్తి లారీలు నంద్యాల మార్కెట్ యార్డుకు వెళ్తున్నాయని, దీని వల్ల రైతులకు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. కావున జిల్లా కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మార్కెట్‌కు ఆదాయం పెరగడమే కాక రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. గతంలో కర్నూలు మార్కెట్‌లో రైతులకు రూ. 10లకే రుచికరమైన నాణ్యమైన భోజనం అందించే వారని, ఎన్నికల కోడ్ వచ్చిందన్న నెపంతో ఈ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారని వాపోయారు. బయట భోజనం రూ. 70ల వరకూ ఉందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కావున ఆ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సుంకన్న, రైతు సంఘం నాయకులు నరసింహులు, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ క్రీడాకారులకు పుట్టినిల్లు పాణ్యం..
* ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
పాణ్యం, నవంబర్ 20:రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి లో పాల్గొని ప్రఖ్యాతిగాంచిన కబడ్డీ క్రీడాకారులకు నిల యం పాణ్యమని పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు చాలా మంది పేరు పొందారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ స్థాయి పైకా పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు, గడివేముల, పాణ్యం మండల స్థాయిల్లో గెలుపొందిన క్రీడాకారులను జిల్లా స్థాయికి పంపేందుకు నిర్వహిస్తున్న క్రీడల పోటీల్లో క్రీడాకారులు గెలుపోటములు ప్రధానం కాకుండ క్రీడాస్పూర్తితో ఆటలు ఆడాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఆటలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అలాకాకుండ గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థుల్లో ఇమిడి వున్న క్రీడా స్పూర్తిని వెలికి తీసేందుకు ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటల నిర్వాహకుల కోరిక మేరకు మండల స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు దుస్తులు ఇస్తామని తెలిపారు. త్వరలో జోనల్స్ ఏర్పాటు చేయడానికి కూడా అధికారులతో మాట్లాడతామన్నారు. జిల్లా స్థాయికి వెళ్తున్న క్రీడాకారులు అక్కడ కూడా తమ నైపుణ్యం ప్రదర్శించి బహుమతులు సాధించాలన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో కబడ్డీలో పాణ్యం బాలురు, బాలికల జట్లు విన్నర్స్ కాగా, ఖోఖోలో పాణ్యం, వాలీబాల్‌లో కల్లూరు విన్నర్స్‌గా గెలుపొందారని వీరిలో నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ చంద్రశేఖర్‌రావు, ఎంపిపి చిన్న సంజీవ, జడ్పీ సభ్యురాలు నారాయణమ్మ, గ్రామ కార్యదర్శి సుదర్శన్‌రావు, జిల్లా కబడ్డీ అధ్యక్షులు గోపి, జిల్లా ఒలింపిక్ ఆరోగ్య కార్యదర్శి విజయకుమార్, జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి శంకర్, ప్రధానోపాధ్యాయులు పాండురంగారెడ్డి, సిఐ పార్థసారథిరెడ్డి, ఎంఇఓ తిమ్మారెడ్డి, సర్పంచ్ సుశీలమ్మ, పిఇటిలు సుబ్రమణ్యం, వెంకటేశ్వరరెడ్డిలతోపాటు నియోజకవర్గంలోని పాఠశాలలకు చెందిన పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
డెంగ్యూతో బాలిక మృతి
* ఒకే ఇంట్లో ముగ్గురికి వ్యాధి లక్షణాలు
చాగలమర్రి, నవంబర్ 20 : చాగలమర్రిలోని పెద్దమకానం వీధికి చెందిన ముల్లా చాంద్‌బాషా ఇంట్లో ఒకేసారి ముగ్గురు పిల్లలకు డెంగ్యూ జ్వరం సోకింది. వీరిలో అతని పెద్ద కుమార్తె ఇమాంబి (11) శుక్రవారం చనిపోయింది. కర్నూలులోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చాంద్‌బాషా తెలిపారు. అతని రెండవ కుమార్తె షమీమ్ కూడా డెంగ్యూ జ్వరం సోకి కర్నూలు రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే కుమారుడు అజరుద్దీన్‌కు కూడా డెంగ్యూ జ్వరం సోకడంతో ఇటీవల కర్నూలులో చికిత్స చేయించుకున్నాడు. ఇమాంబీ డెంగ్యూతో చనిపోయిన విషయం తెలియగానే జిల్లా మలేరియా నివారణ అధికారి హుసేన్‌పీరా ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. దోమల వల్ల ఈ వ్యాధి సోకిందన్నారు. చాగలమర్రిలో డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్నాయని, పిల్లలు చనిపోతున్నారని జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో జిల్లా అధికారులకు తెలియజేశామని, ఏమి చర్యలు తీసుకున్నారని వైద్య ఆరోగ్య స్టాండింగ్ కమిటీ సభ్యుడు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు బాబులాల్ ఆయనను నిలదీశారు. మరణాలు సంభవిస్తున్నా వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కర్నూలులో చికిత్స పొందుతున్న షమీమ్‌కు ప్రభుత్వం ద్వారా ఉచితంగా చికిత్సలు చేయించాలని డిమాండ్ చేశారు.

పరేడ్‌కు హాజరవ్వాలి
* సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి..
* సిబ్బందికి ఎస్పీ సూచన..
* జిల్లా పోలీసు కో-ఆపరేటివ్ సొసైటీ పునఃప్రారంభం
కర్నూలు, నవంబర్ 20:పరేడ్‌కు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, తద్వారా క్రమశిక్షణ అలవడుతుందని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు సిబ్బందికి సూచించారు. అలాగే సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న పరేడ్ మైదానంలో శుక్రవారం సివిల్, ఏఆర్ సిబ్బంది పరేడ్, కవాతు నిర్వహించగా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఎక్కువగా పొగ తాగడం వల్ల అతడి కాలు బాగా దెబ్బతినిందని, అయితే సర్జరీ ద్వారా వైద్యులు బాగు చేశారని తెలిపారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ కంటే అతి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని, కావున పోలీసు సిబ్బంది పొగతాగే దుర అలవాటును మానుకోవాలని సూచించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కోసం యాంటీ స్మోకింగ్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యాసంస్థల వద్ద సిగరెట్లు విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రోజూ వ్యాయామానికి గంట సేపు సమయం కేటాయించాలని సూచించారు. భద్రత స్కీం కింద పోలీసులకు ఇళ్ల స్థలాలు, రుణ సౌకర్యం కల్పిచడానికి డిజిపి సానుకూలంగా స్పందించారన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ప్రతి పోలీసు సభ్యత్వం పొందాలని, మరిన్ని సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని పునఃప్రారభించారు. కొత్తగా వచ్చిన స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు ఈ సొసైటీలో సభ్యత్వం పొందాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు సిబ్బంది నేరుగా తనను సంప్రదించాలని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, రాజశేఖర్‌బాబు, సిఐలు రామకృష్ణ, ములకన్న, మధుసూదన్‌రావు, బివి మధుసూదన్‌రావు, నగరాజుయాదవ్, కృష్ణయ్య, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఏఆర్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.