రాష్ట్రీయం

తెలంగాణ కాటన్ దొర కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, మార్చి 13: ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కాటన్ దొర ఎలానో, తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణలో కాటన్ దొరలా చరిత్రలో నిలిచిపోతారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసన సభలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చర్చను ప్రారంభించారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించారు. మహారాష్టత్రో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి జరిగిన ఒప్పందం తెలంగాణను సస్యశ్యామలంగా మారుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ వర దాయని అని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాటన్ దొర చరిత్రలో నిలిచినట్టుగా ఈ ప్రాజెక్టులతో కెసిఆర్ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. గతంలో కాంట్రాక్టర్ల జేబులు నింపారని, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మట్టి పనులు చేశారని అన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు లభించనుందని తెలిపారు. నాలుగువేల టిఎంసిల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుందని, ఒప్పందం ద్వారా రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. లక్షా 25 వేల కిలో మీటర్ల పరిధిలో పైప్‌లైన్లు వేసి ఇంటింటికి మంచినీటిని అందించనున్నట్టు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా ఇంటింటికి మంచినీటిని అందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగన అని కెసిఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు తెలంగాణకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి 70వేలు ఇచ్చేవారని, ఇప్పుడు ప్రభుత్వం సామాన్యులు గౌరవ ప్రదంగా జీవించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తోందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేస్తోందని అన్నారు.
అభివృద్ధిలో దేశానికే పాఠాలు: వేముల ప్రశాంత్‌రెడ్డి
అభివృద్ధి పనుల్లో తెలంగాణ దేశానికే పాఠాలు చెబుతోందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ప్రయోజనం కలిగే విధంగా పథకాలు చేపట్టినట్టు చెప్పారు. జూన్ నుంచి పగటి పూట తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కెసిఆర్ పాలనను అన్ని వర్గాలు ఆమోదించడం వల్లనే గత ఏడాది కాలం నుంచి ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏకపక్షంగా టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. 2018 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఇంటింటికి మంచినీటిని అందించనున్నట్టు తెలిపారు. గుజరాత్‌లో ఈపథకాన్ని పరిశీలించేందుకు వెళితే అక్కడ ఈ ప్రాజెక్టు ఎండి తాము మోడీ నాయకత్వంలో 12 ఏళ్లపాటు ప్రయత్నిస్తే ఈ పథకం అమలు చేయడం సాధ్యం అయిందని, మీరు నాలుగేళ్లలో చేయడం అసాధ్యం అని అన్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి ఇదే విషయం తీసుకు వస్తే అమలు చేసి చూపిస్తామని ధీమాగా చెప్పారని అన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి పొలానికి సాగునీటిని అందించేంత వరకు బతికి ఉంటే చాలు అని ముఖ్యమంత్రి ఒక సందర్భంలో అన్నారని వేముల తెలిపారు. తెలంగాణ బీడు భూముల్లోకి సాగునీరు పారితీరుతుందని అన్నారు. ప్రాజెక్టులు పూర్తవుతాయి, కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, ముఖ్యమంత్రి వందేళ్ల పాటు జీవిస్తారని వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.