రాష్ట్రీయం

వేడెక్కిన మండలి రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామినేషన్ల దాఖలులో తెరాస ముందంజ
అధికార పార్టీలోకి సాగుతున్న వలసలు

హైదరాబాద్, డిసెంబర్ 7: ఒకవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, అధికార పార్టీలో చేరికలతో శాసన మండలి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. 12 మండలి స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థుల పేర్లను టిఆర్‌ఎస్ ఆదివారం ప్రకటించగా, ఈరోజు అధికార పార్టీ అభ్యర్థు లు నామినేషన్లను వేయడం ప్రారంభించారు. 12 స్థానాలకు సోమవారం మొత్తం ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో ముగ్గురు టి ఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థులు ఉన్నా రు. నల్లగొండ నియోజక వర్గానికి తే రా చిన్నపరెడ్డి, నిజామాబాద్ స్థానానికి భూపాల్‌రెడ్డి, కరీంనగర్ నియోజక వర్గానికి టి భానుప్రసాద్‌రావు సోమవారం నామినేషన్లు దాఖ లు చేశారు. నల్లగొండ నుంచి మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖ లు చేశారు. మహబూబ్‌నగర్ నుంచి ఒకరు, వరంగల్ నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్ నియోజక వర్గాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ నియోజక వర్గాల అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఒకరి నిర్ణయం కోసం ఒకరు ఎదురు చూస్తున్నాయి. ఆదివారం టిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను రాజ్యసభ సభ్యులు కె కేశవరావు విడుదల చేశారు. మిగిలిన అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిపారు. దాంతో రోజంతా అభ్యర్థులు జాబితా కోసం ఎదురు చూస్తూ గడిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గానికి చెంది న కాంగ్రెస్ ఎంపిపి, ఎంపిటిసిలు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు తెలంగాణ భవన్‌లో సోమవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. మండలి ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టి ఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.