తెలంగాణ

చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చర్చలు ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో వాదనలు ముగిశాయి. పండుగుల సమయంలో సమ్మె చేయటం ఏమిటని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ఎందుకు ప్రయోగించకూడదో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలుపగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని ప్రశ్నించింది. తక్షణమే ప్రభుత్వం కార్మికులను చర్చలకు పిలవాలని, ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరం ఉందని, కార్మికులు వెంటనే సమ్మెను విరమించాలని పేర్కొంది. పండుగ సమయంలో రవాణా నిలిపివేస్తే ఎలా అని ప్రశ్నించింది. ప్రజల ఇబ్బందులను ఆర్టీసీ కార్మికులు పరిగణనలోకి తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికుల్లో విశ్వాసాన్ని పాదుకొలిపేందుకు ఆర్టీసీ ఎండీని నియమించాలని ఆదేశించింది. ఇదిలావుండగా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్చలకు పిలిస్తే రావటానికి సిద్ధంగా ఉన్నామని, అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు.