తెలంగాణ

రైతుల ఆత్మహత్యలపై ఏం చేయాలో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టు ఆదేశాలతో 30న సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 28: రైతుల ఆత్మహత్యలకు కారణాలు అనే్వషించడంతో పాటు నివారణా మార్గాలపై చర్చించేందుకు ఈనెల 30న ప్రభుత్వం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. డి బ్లాక్‌లో 30న ఉదయం 11 గంటలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకుప్రభుత్వం ఆరులక్షల రూపాయల పరిహారం చెల్లిస్తోంది. అయితే ఆత్మహత్యలకు అప్పులు ఒక్కటే కారణం కాదని, అదే విధంగా పరిహారం చెల్లించడం ఒక్కటే పరిష్కారం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారానికి ఏం చేయాలో ఒక సమావేశాన్ని నిర్వహించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. దాంతో ప్రభుత్వం 30న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయ నిపుణులు, కోర్టులో కేసు వేసిన వారిని సైతం ఆహ్వానిస్తోంది. తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఈ కేసు వేసిన వారిలో ఉన్నారు. కోదండరామ్ సూచనలు బాగున్నాయని వాటిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. శాస్తవ్రేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో చర్చించేందుకు నిపుణుల కమిటీ వేయాలని కోర్టు సూచించిన మేరకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో చర్చిస్తారు.