రాష్ట్రీయం

శాసనసభలో ఏకపక్ష నిర్ణయాలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, డిసెంబర్ 24: శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బిల్లులను ఆమోదించడం శోచనీయమన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు, పరిశ్రమలకు భూములను 99 సంవత్సరాలకు లీజుకిచ్చే బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో దాసరి భవన్‌లోని పార్టీ రాష్ట్ర సమితి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు శాసనసభ గౌరవాన్ని, స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహరించడం దారుణమని ఆక్షేపించారు. బూతుల పంచాంగానికి వేదికగా మార్చివేశారంటూ దుయ్యబట్టారు. టిడిపి తన మిత్రపక్షం బిజెపితో కలసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. శాసనసభలో వామపక్షాలు లేకపోవడంతో ప్రజా సమస్యలు, కరవు, రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగుల సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులు, బాక్సైట్ గనులు తదితర ముఖ్యమైన అంశాలపై చర్చలే జరగడం లేదన్నారు. రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలుండగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు వలన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.