రాష్ట్రీయం

దేశద్రోహుల్ని పోషిస్తున్న ఎన్‌డీఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిపిఐ నేత నారాయణ ఆరోపణ
నెల్లూరు, మార్చి12: దేశాన్ని దోచుకుంటున్న నిజమైన దేశద్రోహుల్ని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని సి పి ఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం నెల్లూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టిన విజయమాల్యా లాంటి పలువురు బడా పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వమే ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించారు. ఓ వైపు తాను పరారీలో లేనని, వ్యాపార రీత్యా విదేశాల్లో ఉన్నట్లు స్వయానా విజయమాల్యానే చెప్తున్నా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో బహిరంగంగా విలాసాలు అనుభవిస్తున్న విజయమాల్యా లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకునే దమ్ము కేంద్రానికి లేదన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో వామపక్షాలపై దాడులు తీవ్రమైనాయని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌లు దేశ ద్రోహులు ఎక్కువగా ఉన్న కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారనీ, దీన్ని బట్టే వారి దేశభక్తి ఏపాటిదో అర్థమవుతోందని అన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్శిటీలో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబివిపి ఓడిపోయిందనీ, దీనికి కారణం కన్నయ్యకుమార్ అని భావించి అతనిపై దేశద్రోహం కేసు బనాయించారని ఆరోపించారు. హెచ్‌సియులో ఆర్‌ఎస్‌ఎస్, వి హెచ్‌పీలు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విద్యార్థి సంఘాలు ఎత్తివేయాలని అంటున్నారనీ, ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన విషయం మరచిపోతున్నారని ఎద్దేవా చేశారు.