తెలంగాణ

తెరాస నేతల ద్వంద్వ వైఖరి : నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిజాంను పొగుడుతుంటే, ఆయన కుమార్తె కవిత చాకలి ఐలమ్మను కీర్తిస్తూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి మగ్దూం విగ్రహం వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్రలో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆనాటి నిజాం పాలనలో ఉన్న జిల్లాల్లో ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుతుండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీటిని నిర్వహించడానికి భయపడుతోందని విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నారాయణ డిమాండ్‌ చేశారు.