మెదక్

ఘనంగా సిపిఎం రాష్ట్ర స్థాయ విస్తృత సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హాజరైన సీతారాం ఏచూరి
బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం
* 200 మంది ప్రతినిధుల హాజరు
* నేడు ముగియనున్న సమావేశాలు
సంగారెడ్డి , నవంబర్ 29: కమ్యూనిస్టు పార్టీల ఆవిర్భావం నుంచి ఎప్పుడు నిర్వహించని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలను సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పార్టీలో రెండు రోజుల పాటు నిర్వహించడానికి ఆదివారం ప్రారంభించింది. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, తెలంగాణాలోని పది జిల్లా నుంచి 200 మంది సిపిఎం పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలకు హాజరైన జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, వెంకట్, తమ్మినేని వీరభద్రం, మల్లు స్వరాజ్యం తదితరులను కళాజాత బృందం డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఘన స్వాగతం పలికారు. కేవల్ కిషన్ భవనం ముందు పార్టీ జెండాను ఆవిష్కరించి సంఘటిత శక్తిని చాటి చెప్పారు. పార్టీ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభా వేదికపై చేరుకున్న అనంతరం ఆహ్వాన కమిటి అధ్యక్షులు చుక్క రాములు జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, సామాజిక, వెనుకబాటుతనానికి దారి తీసిన పరిస్థితులు, కుంటుపడిన వ్యవసాయం, తాగునీటి సమస్య, పారిశ్రామికీకరణ, నిరుద్యోగ సమస్య, కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. వేదికపైకి చేరుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రచించిన పుస్తకాన్ని సీతారాం ఏచూరి తదితరులు ఆవిష్కరించారు. సారంపల్లి మల్లారెడ్డి, వి.శ్రీనివాస్‌రావు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఇద్దరు బాలికలు వేధికపైకి చేరుకుని సీతారాం ఏచూరికి సిపిఎం జెండా రంగుతో కూడిన అరుణ పుష్పాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాలికలతో అప్యాయంగా పలుకరించి చదువులపై ఆరా తీసారు.