మహబూబ్‌నగర్

ఎన్నికలకు దూరంగా ఉన్న సిపిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నలుగురు ఎంపిటిసిలు పోలింగ్‌కు గైర్హాజరు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 27: జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొ ఓటు ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీకి సంబంధించిన ఎంపిటిసిలు ఓటింగ్‌కు గైర్హాజరు అవుతారని నిర్ణయించారు. దింతో జిల్లాలో సిపిఎం పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపిటిసిలు పోలింగ్‌కు గైర్హాజరు అయ్యారు. డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారంటూ ఈ ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయమంటూ ఓటింగ్‌కు ఎంపిటిసిలు దూరంగా ఉంటారని సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీకి సబంధించిన నలుగురు ఎంపిటిసిలు ఓటుహక్కును వినియోగించుకోలేదు. అలంపూర్ నియోజకవర్గం ప్రాగటూర్ గ్రామ ఎంపిటిసి తిరుపతమ్మ, కొల్లాపూర్ నియోజవర్గంలోని పాన్‌గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన ఎంపిటిసి వేణుగోపాల్, నారాయణపేట నియోజకవర్గంలోని కొటకోండ ఎంపిటిసి సరళ, దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసిలు లక్ష్మీలు పోలింగ్‌కు దూరంగా ఉండి ఓటు వేయలేదు. దింతో జిల్లాలో 100శాతం పోలింగ్ జరుగుతుందని భావించినప్పటికి 99.7శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 1260 మంది ఓటర్లు ఉండగా సిపిఎం పార్టీకి సంబంధించిన నలుగురు ఎంపిటిసిలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో 1256 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట, గద్వాల, వనపర్తి పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే పోలింగ్ ముగిసింది. సిపియం పార్టీకి చెందిన వారు ఈ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా సాయంత్రం 4 గంటల వరకు అధికారులు వారి కోసం వేచిచూశారు. సమయం ముగియడంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.