హైదరాబాద్

క్రిమీలేయర్‌ను స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 29: బిసిల్లో అత్యంత వెనుకబడిన వారికి ఉపయోగపడే క్రిమీలేయర్‌ను తాము స్వాగతిస్తున్నామని జాతీయ ఎంబిసి సంక్షేమ సంఘం పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడు కెసి.కాలప్ప, ప్రధాన కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిసి కులాలు సంఖ్య దాదాపు 138 కులాలు ఉండగా కేవలం కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి చెందాయని అన్నారు. ఇందుకు కారణం ఏ,బి,సి,డి, ఈ గ్రూపులు చేసినా అవి శాస్ర్తియ పద్ధతిలో జరగకపోవడమేనని అన్నారు. ప్రస్తుతం ఉన్న బిసి జాబితాను సమీక్షించి ఎంబిసి, బిసి, డిఎన్‌టి (సంచార జాతులు) మూడుగా విభజించాలని వారు కోరారు. ప్రస్తుతం బీసీ కులాల గురించే మాట్లాడే మేధావులు బిసిల్లో వెనుకబడిన జాతుల కులాల పేర్లు కూడా తెలియవని అన్నారు. క్రిమీలేయర్ జీఓను అడ్డుకోవడానికి యత్నించడం సరికాదని, ఆ జీఓలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటే మంచిదని అన్నారు.
క్రీమిలేయర్‌ను వద్దంటున్న వారితో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వారు సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ప్రేమ్‌లాల్, నగర అధ్యక్షుడు జగదీష్‌కుమార్, పీ. రంగాచారి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.