సబ్ ఫీచర్

కళావిద్యతో సృజనాత్మకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి విద్యావిధానంలో ఓ కరిక్యులర్ యాక్టివిటీస్ తప్పనిసరిగా మారింది. పదవ తరగతి విద్యార్థులకు ఎనభై మార్కులు ప్రతి సబ్జెక్టులో ఉంటూనే ఇరవై మార్కులు కళలు-సాంస్కృతిక విద్యకు ఉంటున్నాయి. కళలు మన సంస్కృతికి ప్రతిబింబాలు. వ్యక్తి మానసికోల్లాసానికి ఎక్కడైతే అవకాశం ఏర్పడుతుందో అక్కడ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది అని అంటారు ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్. మానవ సమాజాలు పరిణామం చెందుతున్న క్రమంలో ఎన్నో కళలు ఆవిర్భవించాయి. చాలాకాలంపాటు ఆయా కళలు ఒక తరంనుండి మరో తరానికి నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. కుండలు తయారుచేసే వ్యక్తి తన పిల్లలను ఆయా పనులలో నిమగ్నం చేసుకొని వారిని కూడా నిపుణులుగా తీర్చిదిద్దేవాడు. ఒక సంగీతకారుడు కుటుంబ జీవితంలో పాటను మమేకం చేసుకొనేవాడు. నాట్యకారుడు నాట్యం లేనిదే మనుగడ లేదన్నంతగా మదనపడేవాడు. అప్పటి సమాజం ప్రతి కళను కాపాడుకునేందుకు, కొనసాగించుకునేందుకు ప్రయత్నించేది. కాలక్రమంలో కళలు ఎన్నో కొత్తపుంతలు తొక్కాయి. మార్పులు చోటుచేసుకున్నాయి. బొమ్మలుగీస్తూ కూర్చుంటే తినడానికి తిండి ఎక్కడనుండి వస్తుందని, అది పనిపాట లేనివాళ్ళు చేసే కార్యక్రమమనే భావన తల్లిదండ్రుల్లో మొదలైంది. పిల్లలు చదువుల చట్రంలో చిక్కుకుపోవడంతో వారిలో సృజనాత్మకత చితికిపోయింది.
మనసున్న మనుషుల్లా పిల్లల్ని తీర్చిదిద్దాలంటే చదువుల్లో కళలు కాలు నాలి. సంస్కృతి పది కాలాలపాటు విలసిల్లాలంటే పాఠశాలల్లో కళావేదికలు కొలువుదీరాలి. ఇందుకోసం రూపొందిందే కళావిద్య. కళలు మరియు సాంస్కృతిక విద్య అంటే ఏమిటి? ఎందుకు? వీటి ద్వారా పిల్లల్లో ఏయే లక్షణాలు, సామర్థ్యాలు అలవడతాయి? ఆరోగ్య విధానం అలవర్చుకోవడంలో ఈ కళలు ఏ విధంగా దోహదపడతాయి? కళ మరియు సాంస్కృతిక విద్య పాఠశాలల్లో అమలుచేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? ఎలాంటి స్థానిక సహకారం తీసుకోవాలి? కళలు మరియు సాంస్కృతిక విద్యలు ప్రభావవంతంగా అమలుచేయడం ఎలా? కళలు మరియు సాంస్కృతిక విద్యలో పిల్లలను ఎలా మూల్యాంకనం చేయాలి? ప్రతిభగల వారిని ఎలా గుర్తించాలి? అనేది ఉపాధ్యాయుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళలు-సాంస్కృతిక విద్యలో, పిల్లలు బొమ్మలుగీయడం మొదలుకొని వాద్య పరికరాలు వినియోగించడం, నటించడంవరకు ఉన్న అంశాలన్నీ మన సంస్కృతికి సాంప్రదాయాల పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. పిల్లలకు భాష పట్ల, సంస్కృతి పట్ల, కళల పట్ల, సున్నిత మనసు ఏర్పడుతుంది.
దీని ద్వారా పిల్లలను ఆయా రంగాలలో నిపుణులుగా తయారుచేయడం కళలు- సాంస్కృతిక విద్య ముఖ్యఉద్దేశం కాదు. కళల పట్ల అభిరుచి కలిగిన వారిగా తీర్చిదిద్దడమే ప్రధానం. ఇది భవిష్యత్తులో వారికి ఉపాధి మార్గంగా మారే అవకాశం లభిస్తుంది. పిల్లలు తమ అభిరుచుల మేరకు చదువుకునే అవకాశం లభించినట్లవుతుంది. అందువల్ల వారు మరింత సృజనాత్మకంగా మసలుకోగలుగుతారు. పాఠ్యప్రణాళికలో నిర్ధారించిన అంశాలలో పిల్లలకు శిక్షణనివ్వడంలో పాఠశాలలు అవసరమైన వనరులను సమకూర్చుకోవడంలో స్థానిక కళాకారులు ఎంతగానో సహాయపడతారు. ఇది పిల్లలకు కళల పట్ల అభిరుచి కలిగించడంతోపాటు స్థానిక కళల పట్ల అవగాహన, సమాజంపట్ల బాధ్యత వహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొమ్మలు గీయడం, రంగులువేయడం, పాటలు పాడటం, నాట్యంచేయడం, తోలుబొమ్మలాడించడం, నాటికలలో నటించడం మొదలైన అంశాలన్నిటినీ కళావిద్య బోధనలో భాగం చేసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి. కళా విద్యను ఇతర సబ్జక్టుల బోధనలో సమ్మిళితం చేయాలి. కళలు- సాంస్కృతిక విద్యను ఒక సహ పాఠ్య అంశంగా పాఠశాలల్లో అమలవుతుంది. కాబట్టి దీన్నికూడా తప్పనిసరిగా మూల్యాంకనం చేయాలి. ఒక్కొక్క విద్యాప్రమాణానికి 10 మార్కుల చొప్పున మొత్తం 50 మార్కులపై గ్రేడు నిర్ధారించాలి. అయితే వీటిని కేవలం సమ్మెటివ్ మూల్యాంకన సమయంలో మాత్రమే వీటిని నమోదుచేయాలి. రాష్ట్రంలోని బాలలందరికీ విలువైన విద్యను, విలువలు గల విద్యను అందించి, వారిని ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాలనేది ప్రథమ లక్ష్యంగా ఉపాధ్యాయులు బోధన చేయాలి. తప్పనిసరిగా కళా విద్యపట్ల ఆసక్తి కలిగేటట్లు విద్యార్థులను మోటివేట్ చేయాలి.

- జి. రమణయ్య