క్రీడాభూమి

భారత మహిళా క్రికెటర్‌కి అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రతిష్ఠాత్మక మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ)లో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రాకు జీవితకాల సభ్యత్వం లభించింది. భారత్‌ నుంచి ఈ గౌరవం దక్కిన తొలి మహిళా క్రికెటర్‌గా అంజుమ్‌ చరిత్రలో నిలిచింది. భారత్‌ నుంచి జహీర్‌ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు అంజుమ్‌కు సభ్యత్వం కల్పిస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. 39 ఏళ్ల అంజుమ్‌ 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడింది. సునీల్‌ గావస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌లాంటి భారత క్రికెట్‌ దిగ్గజాలకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం ఉందని.. ఆ జాబితాలో తన పేరు ఉండటం ఎంతో సంతోషం కలిగించిందని అంజుమ్‌ పేర్కొంది.