క్రైమ్/లీగల్

నిర్భయ కేసులో 20న సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 20న సుప్రీం కోర్టు విచారణకు రానుంది. నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌నని అతడు సుప్రీంను ఆశ్రయించాడు. గతంలో పవన్ గుప్తా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలసిందే. 2012నాటికి తాను మైనర్‌నని శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. ఢిల్లీ హైకోర్టు మరణశిక్షను రద్దుచేయాలని పవవ్ గుప్తా పిటిషన్‌లో అభ్యర్థించాడు. న్యాయమూర్తులు ఆర్ బానుమతి, అశోక్ భూషణ్, ఎఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం 20న గుప్తా పిటిషన్‌ను విచారించనుంది. సంఘటన జరిగే నాటికి తాను మైనర్‌నని వాదిస్తున్న దోషి పవన్‌గుప్తా ఫిబ్రవరి 1న అమలుచేయనున్న ఉరి శిక్షను రద్దుచేయాలని కోరుతున్నాడు. డిసెంబర్ 19న పవన్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులు విజయ్ శర్మ(26), ముకేష్ కుమార్(32), అక్షయ్ కుమార్ సింగ్(31), పవన్ గుప్తా(25)కు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మరోపక్క ముకేష్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్, అక్షయ్ సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదు. కాగా 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగే సమయంలో తన క్లయింట్ పవన్ గుప్తా మైనర్ అని అతడి తరఫున్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నాడు.