క్రైమ్/లీగల్

ప్రొఫెసర్ ఖాసీం అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు సోదాలు జరిపిన పోమలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను పోలీసులు అరెస్టు చేసి గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. ప్రొఫెసర్ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు.
అప్పట్లో ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు చెప్పారు. ఇదే కేసులో భాగంగానే మరోసారి సెర్చ్ వారెంట్లతో సోదాలు చేశామని పోలీసులు పేర్కొన్నారు.