క్రైమ్/లీగల్

ప్రచారంలో ఘర్షణ : ఇద్దరిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 19: బోడుప్పల్‌లో ఎన్నికల ప్రచారం ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని 20వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి జడిగె మహేందర్ యాదవ్ తరపున మామ అయిన తోటకూర శ్రీశైలం యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ఇదే డివిజన్‌లో శ్రీశైలం అన్న కుమారుడు తోటకూర మల్లేష్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. ఒకే డివిజన్‌లో ఎన్నికల ప్రచారం జోరకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రీశైలం తన పెద్దన్న కుమారుడు మల్లేష్ మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలువాలనే తపనతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్ సోదరుడు విజయ్ యాదవ్ బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో బాబాయ్ శ్రీశైలం వచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్వర ఘర్షణలకు దిగారు. బైక్‌తో వచ్చి వెనుక నుంచి కొట్టాడని విజయ్ ఫిర్యాదు చేయగా తనపై దాడి చేశారని శ్రీశైలం సైతం ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారని శ్రీశైలం యాదవ్ ఆరోపించగా అనవసరమైన గొడవలు చేస్తూ కుటుంబ పరువుతీస్తున్నారని విజయ్ చెప్పారు. ఇచ్చిన ఫిర్యాదులపై ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.