క్రైమ్/లీగల్

భాగ్యనగరంలో భారీగా డ్రంకన్ డ్రైవ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్థరాత్రి నుంచి పలు చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 32 మందిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి 16 కార్లు, 16 బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వీరికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బేగంపేట్‌లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో కుటుంబసభ్యులతో సహా సోమవారం హాజరు కావాలని ఆదేశించారు. మద్య తాగి వాహనాలు నడిపితే కలిగే నష్టాల గురించి కుటుంభ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. పట్టుబడిన వారిని మంగళవారం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. గత 20 రోజుల క్రితం కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 అర్థరాత్రి నిర్వహించిన ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 1824 కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 3,148 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.