క్రైమ్/లీగల్

ప్రైవేట్ బస్సులపై దాడులు: 54 బస్సులు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: కాంట్రాక్ట్ క్యారేజీ పేరిట పర్మిట్లు తీసుకుని, ఆర్టీసీ బస్సుల తరహాలో అడుగడుగునా ఆగుతూ అక్రమంగా ప్రయాణికులను ఎక్కించుకుంటూ స్వైర విహారం చేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఉక్కుపాదం మోపటానికి రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ పీ సీతారామాంజనేయులు నిర్ణయించారు. దీనిలో భాగంగా తొలిసారి మంగళవారం అర్ధరాత్రి వేళ విజయవాడ, విశాఖ, అనంతపురం తదితర ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. దాదాపు 400 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయగా వాటిల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 54 బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేశారు. ఈ తనిఖీలో ప్రధానంగా కావేరీ ట్రావెల్స్, భారతీ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్, జబ్బార్ ట్రావెల్స్, సలీం ట్రావెల్స్, కేజీఎన్ ట్రావెల్స్, జయంతి ట్రావెల్స్ బ్యానర్లపై తిరిగే బస్సులే అధికంగా పట్టుబడ్డాయి. వీటిల్లో నాలుగు బస్సులు పన్ను చెల్లించకుండా పట్టుపడటం, మరో నాలుగు బస్సులు రెండో డ్రైవర్ లేకుండా, అలాగే నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ మార్చిన రెండు బస్సులు ఉన్నాయి. డ్రైవర్లందరికీ బ్రీత్ ఎన్‌లైజెన్స్ ద్వారా శ్వాస పరీక్షలు కూడా చేశారు.