క్రైమ్/లీగల్

వరి పంట కుప్పలకు నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, జనవరి 21: సంక్రాంతి నెల వచ్చిందంటే పంట చేతికి వచ్చిన సంతోషంలో రైతులతో కళకళలాడే పల్లెలు దుష్ట రాజకీయాలతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలకు వేదికగా మారుతున్నాయి. మంగళవారం తెల్లారే సరికి నక్కవానిదారి గ్రామానికి చెందిన అప్పికట్ల వెంకటేశ్వరరావు(బుజ్జి)కి చెందిన ఎకరన్నర పొలంలోని రెండు వరికుప్పలు పూర్తిగా కాలిపోయి నల్లగా పొగలు కక్కుతూ కనిపించాయి. చుట్టూ ఉన్న మినుము పైరు పచ్చగా ఏపుగా పెరిగి పొలాలు ఆహ్లాదంగా కనిపిస్తుంటే వాటి మధ్య అగ్నికిలలతో రగులుతున్న కుప్పలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. కాగా బాధితుడు అప్పికట్ల వెంకటేశ్వరరావుకి ఇద్దరు సోదరులు ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి ఆ కుటుంబంలోని ఎవరో ఒకరి పంట కుప్పలు, పశువుల చావిడికి నిప్పుపెట్టడం లాంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం కుప్పలను తగలబెట్టటం తదితర ఘటనలపై మంగళవారం కోడూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కోడూరు ఎస్‌ఐ పి రమేష్ విచారణ చేపడుతూ నిందితులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. పొలాలన్నీ ఏపుగా పెరిగి, మంచు పట్టి ఉండడంతో పోలీసు జాగిలాలు కూడా ఏమీ పసిగట్టలేకపోయినట్లు తెలిసింది. ఏమైనా ఇలాంటి సంఘటనలు చక్కని పల్లె వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయని పలువురు వాపోతున్నారు.