క్రైమ్/లీగల్

కాటన్ మిల్లులో ఐటీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట రూరల్, జనవరి 21: సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో గల మంజిత్ పత్తి మిల్లుపై మంగళవారం ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం ఉదయం నుండి మిల్లులో సోదాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వరకు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఉదయం మిల్లులోకి ప్రవేశించిన వెంటనే మిల్లు యాజమాన్యానికి చెందిన వారి సెల్‌ఫోన్‌లను తీసుకోవడంతో పాటు రికార్డులను స్వాధీన పర్చుకొని విచారిస్తున్నారు. ఐటీ అధికారులు మిల్లు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి బయట నుండి ఎవరూ లోనికి రాకుండా కట్టడి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 34 మంజిత్ కాటన్ మిల్లులపై ఏకకాలంలో జరుపుతున్న దాడుల్లో భాగంగా ఇక్కడ కూడా దాడులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో మిల్లు గేట్లు మూసివేయడంతో సీరియల్ ప్రకారం పత్తిని విక్రయానికి తెచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మీడియాను సైతం లోపలికి అనుమతించకపోవడంతో ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియ రావడం లేదు. అర్థరాత్రి వరకు ఐటీ దాడులు కొనసాగే అవకాశమున్నట్టు ఐటీ సిబ్బంది తెలిపారు.