క్రైమ్/లీగల్

దర్శనం టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన టీటీడీ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: దర్శనం, వసతి కల్పిస్తానంటూ హైదరాబాద్‌కు చెందిన భక్తుడి నుంచి రూ. 40వేలు ప్యాకేజీ మాట్లాడుకుని భక్తుడితో ఏర్పడిన విభేదాలతో టీటీడీ అటెండర్ దామోదర్ రెడ్డి పోలీసులకు అడ్డంగా దొరికాడు. టూ టౌన్ సి ఐ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ నరసింగరావు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో దామోదర్ రెడ్డిని సంప్రదించాడు. ఐదు విఐపి బ్రేక్ టికెట్లు, రెండు గదులు ఇప్పిస్తానని ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇందుకు రూ. 40వేలు చెల్లించాలని దామోదర్ రెడ్డి భక్తుడికి సూచించాడు. దీంతో ఈనెల 17వ తేదీన నరసింగరావు, దామోదర రెడ్డి అకౌంట్‌లో రూ. 24వేలు జమ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం నరసింగరావు కుటుంబ సమేతంగా తిరుపతికి చేరుకున్నాడు. వకుళాదేవి అతిధిగృహంలో రెండు గదులను అటెండర్ దామోదర్ రెడ్డి భక్తుడికి ఇప్పించాడు. బుధవారం తన సిఫార్సుతో పొందిన ఐదు బ్రేక్ టికెట్లను వారికి అందించాడు. తక్కిన 16వేలు ఇవ్వాలని దామోదర్ రెడ్డి ఆ భక్తుడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో నరసింగరావు వాదనకు దిగాడు. ఈ క్రమంలో భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విజిలెన్స్ అధికారులు దామోదర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని టు టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*