క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం:భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జనవరి 23: తోట్లవల్లూరు సమీపంలోని కరకట్ట మీద బు ధవారం రాత్రి 10 గంటల సమయం లో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టటంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరసా రవికాంత్, పరసా విజయలక్ష్మి ఇద్దరు ప్రైవేటు సెక్యూరీటీగార్డులుగా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ డ్యూటీ దిగి బైక్‌పై కరకట్ట మీదగా విజయవాడ నుంచి తోట్లవల్లూరు వస్తుండగా తోట్లవల్లూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొనటంతో బైక్ నుజ్జునుజ్జు అయ్యి ఇద్దరు కింద పడిపోయారు. వీరిని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరసా విజయలక్ష్మి(38) అప్పటికే మృతిచెందగా పరసా రవికాంత్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పరసా రవికాంత్ స్వస్థలం పెడన మండలం నందమూరు గ్రామం. ఉద్యోగ రీత్యా అత్తగారి ఊరైన తోట్లవల్లూరులో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. విజయలక్ష్మి తమ్ముడు ఫణీకిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై చిట్టిబాబు గురువారం తెలిపారు. విజయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుంటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు.