క్రైమ్/లీగల్

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, ఏప్రిల్ 6: భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో భార్య పుట్టింటికి వెళ్లి.. మళ్లీ రాకపోవడాన్ని అవమానంగా భావించిన భర్త తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన ధారూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పులిచింతల మడుగు తండాకు చెందిన గుండ్యా నాయక్ (51) అతని భార్య సోనీబాయి తరచూ గొడవలు పడేవారు. రెండురోజుల క్రితం కూడా గొడవ పడడంతో భార్య తన తలి లగారింటికి వెళ్లిపోయంది. ఆ తర్వాత గుండ్యానాయక్ అక్కడకు వెళ్లి ఇంటికి రమ్మని ఎంత బతిమిలాడినా.. భార్య రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ విషయమై తన తల్లి మంగ్లీబాయికి వివరించి తాను చనిపోతానని చెప్పాడు. ఆమె సముదాయించి నచ్చజెప్పినా వినకుండా శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి మంగ్లీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.

పాతబస్తీలో హత్య కేసు
* బాలుడితో సహా 9 మంది అరెస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 6: పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న నమోదైన హత్య కేసులో బాల నేరస్తుడు, మరో 9 మందిని హుస్సేనీ ఆలం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి దక్షిణ మండల డీసీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరెస్టు అయిన వారిలో ఆష్‌ఫక్ అలీ ఖాన్, షా నూర్ ఘాజీ, అసద్ అలీఖాన్, సయ్యద్ జమీలుద్దీన్, గౌస్ పాషా, మహ్మద్ అమీర్ హుస్సేన్, మహ్మద్ కలీముద్దీన్ ఖాన్, మహ్మద్ షహరుఖ్ ఖాన్, జమాల్‌బిన్ నాసర్ బస్లూమ్, మరో 17 ఏళ్ల షేక్ అజామ్ అనే బాలనేరస్తుడు ఉన్నారు. కాగా మరో ముగ్గురు నిందితులు అర్షాద్, ముసా, పర్వేజ్‌లు పరారీలో ఉన్నారు. షేక్ ఇమామ్ అనే వ్యక్తి తన కుమార్తె ఎంగేజ్‌మెంట్ సందర్భంగా హుస్సేనీ ఆలం తహరీక్ మంజిల్ ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేశాడు. విందు సందర్భంగా తమకు సరిగ్గా మాంసం వడ్డించలేదనే కారణంగా ఇమామ్ కుమారుడు షేక్ ఆజామ్ స్నేహితుడు, మరికొందరు విందు ముగించిన తర్వాత తిడుతూ, అల్లరి చేస్తున్నారు. విందు సిద్ధం చేసిన అన్వర్‌ఖాన్ అలియాస్ అనుబా వెళ్లి గొడవ చేయవద్దని వారికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆగకపోవడంతో వారిలో నూర్ ఘాజీని అన్వర్‌ఖాన్ కొట్టాడు. దీంతో ఆగ్రహించిన అతను మిగిలిన తన స్నేహితులకు ఫోన్ చేయగా వారు కత్తులతో వచ్చి అన్వర్‌ఖాన్‌పై దాడి చేయడంతో చనిపోయాడు. ఈ సంఘటనపై మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో రెండో వాడైన షానూర్ ఘాజీ రౌడీషీటర్. ఇతను ఇమామ్ కుమారుడు షేక్ అజామ్ స్నేహితుడు. మిగిలిన నిందితులతో కలిసి ఈ గొడవలో పాల్గొన్నందుకు ఇమామ్ కుమారుడు అజామ్‌ను కూడా బాలనేరస్తుడిగా అరెస్టు చేశారు.