క్రైమ్/లీగల్

తక్షణమే విచారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైతం తిరస్కరించిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన ముకేష్ కుమార్ సింగ్.. అత్యవసర కేసుగా భావించి తక్షణమే విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌ల ధర్మాసనం దీనిపై స్పందించారు. ‘ఒక వ్యక్తికి మరణశిక్ష త్వరలో అమలు కాబోతోంది అంటే.. అంతకన్నా అత్యవసర కేసు అంటూ ఏదీ ఉండదు’ అని బాబ్డే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిర్భయ దోషులు నలుగురికీ క్షమాభిక్షను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు వీరికి ఉరి శిక్ష అమలు కావల్సి ఉన్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ముకేష్‌కుమార్ సింగ్ మళ్లీ సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఈ విషయంలో సింగ్ తరఫు న్యాయవాదులు సంబంధిత అధికారులను ఆశ్రయించాలని’ ధర్మాసనం సూచించింది. ‘ఉరి శిక్ష కేసుకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది’ అని ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. దోషి సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించడం.. రాష్టప్రతి సైతం క్షమాభిక్షను తిరస్కరించిన తరుణంలో ‘క్షమాభిక్ష పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని అర్థించాడు. ముకేష్ సింగ్‌తో పాటు అక్షయ్‌కుమార్ క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు దోషులైన పవన్ గుప్తా (25), వినయ్‌కుమార్ శర్మ క్యురేటివ్ పిటిషన్‌ను ఇంతవరకు దాఖలు చేయలేదు.
గణతంత్ర దినోత్సవం నుంచి ప్రతిరోజూ ఉదయం సమావేశం సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదవాలని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం చేసింది. ఈ నిర్ణయంతో సోమవారం తరగతుల ప్రారంభానికి ముందే గుండెపై చేయి వేసుకుని రాజ్యాంగ పీఠికను చదువుతున్న విద్యార్థులు