క్రైమ్/లీగల్

హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ తరఫున ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించిందని పేర్కొంటూ సీబీఐ న్యాయస్థాన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా పరిపాలనా విధులు నిర్వహించే బాధ్యత తనపై ఉందని, ఈ కారణంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయనే కారణంతో హాజరు మినహాయింపును నిరాకరించడం సరికాదని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. గతంలో ఈడీ, సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించిందని, దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించినట్టు ఆయన న్యాయవాదులు తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరిపే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.