క్రైమ్/లీగల్

రొయ్యల దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జనవరి 27: ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత దారి దోపిడీకి గురై రూ.11లక్షలు విలువ చేసే రొయ్యల కేసులో రెండు రోజుల్లో ముద్దాయిలను గుర్తించి పట్టుకుని సోమవారం అరెస్టు చేసినట్లు గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు నాగేంద్ర కిషోర్ కుమార్‌కు చెందిన నాలుగు టన్నుల రొయ్యలు కంటైనర్ లారీ ద్వారా భీమవరం నుంచి నెల్లూరు వెళుతున్నప్పుడు పామర్రు మండలం కొమరవోలు గాంధీ ఆశ్రమం వద్ద కర్రా లాజర్ అనే వ్యక్తి మొదట బైక్‌పై వచ్చి లారీని అడ్డగించి నిలుపుదల చేశాడు. వెనుక ఆటోలో ఆశీర్వాదం, పల్లే ఖాదర్‌వలీ, జంగాల దుర్గారావు, సాలా పెద్దిరాజు, కుర్రపాటి అజయ్, సమ్మిట అప్పారావు వచ్చి కంటైనర్ లారీ డ్రైవర్ విఘ్నేష్ కుమార్‌ను కొట్టి కాళ్లు, చేతులు కట్టివేసి నోటికి ప్లాస్టర్ వేసి రేపల్లె నుంచి దుండగులు రప్పించిన వేరే కంటైనర్‌లోకి రొయ్యలను లోడ్ చేసుకున్నారని, అటు పిమ్మట విఘ్నేష్ కుమార్‌ను కూడా లోడ్ చేసిన లారీలో పడవేసి పరారయ్యారని డీఎస్పీ సత్యానందం వివరించారు. ఉయ్యూరు దగ్గర చిన ఓగిరాల వద్ద డ్రైవర్ విఘ్నేష్ కుమార్‌ను దింపివేసి నెల్లూరు జిల్లాలో రిటైల్‌గా రొయ్యలను దుండగులు విక్రయించారన్నారు. దుండగులను, వారి నుంచి రొయ్యలను విక్రయించగా వచ్చిన రూ.10లక్షల నగదును సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రేపల్లె లారీని కూడా సీజ్ చేశామని, నిందితులలో నాయక్, ప్రతాప్, కట్టా ప్రభుకుమార్, కర్రా లాజర్ వద్ద నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పామర్రు సీఐ ఎం కిషోర్‌బాబు, ఎస్‌ఐ ఎ గణేష్ కుమార్ కేసును తక్కువ సమయంలో చేధించి నిందితులను పట్టుకున్నందుకు డీఎస్పీ సత్యానందం వారిని అభినందించారు.