క్రైమ్/లీగల్

నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో దోషి ముకేష్‌కుమార్ సింగ్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించాలని చేసిన విజ్ఞప్తిమేరకు సుప్రీంకోర్టు మంగళవారం విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచింది. బుధవారం తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, నిర్భయ ఘటనలో దోషులుగా ఖరారైన వారిలో ఒకడైన ముకేష్‌కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు స్పష్టం చేసింది. అత్యంత హేయంగా నిర్భయపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన ఘటనలో దోషిగా ఖరారై జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ దోషిని అధికారులు సక్రమంగా చూడలేదంటూ సాకు చూపడం క్షమాభిక్ష ప్రకటించడానికి ఓ కారణం ఎంతమాత్రం కానే కాదని పేర్కొంది. దోషికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పంపుతూ క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం శాఖ పంపిన నేపథ్యంలోనే రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ దానిని తిరస్కరించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని అశోక్‌భూషణ్, ఏఎస్ బోపన్నల ధర్మాసనానికి స్పష్టం చేశారు. అత్యంత హేయమైన దారుణానికి దోషి సింగ్ ఒడిగట్టినప్పటికీ జైలులో అతనిని ఏకాంతవాసిగా ఉంచలేదనీ.. ఉండబోదని మెహతా వివరించారు. అలాగే, ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు న్యాయ సమీక్ష పరిమితి అతి తక్కువగా ఉంటుందని పేర్కొన్న ఆయన.. ఈ క్షమాభిక్ష పిటిషన్‌పై ఏమాత్రం ఆలస్యం జరిగినా అది అమానవీయ ప్రభావానికే దారి తీస్తుందని ఆయన అన్నారు. దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి.. సంతృప్తి చెందిన అనంతరమే ఆయన నిర్ణయాన్ని వెలువరిస్తారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడానికి ముందు రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ఏ విధంగా కేసును లోతుగా పరిశీలించలేదని మీరు అభియోగం మోపుతున్నారని సింగ్ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్టప్రతికి కేంద్ర ప్రభుత్వం సమర్పించలేదని దోషి తరఫు న్యాయవాది ఆరోపించడంపై తుషార్ మెహతా స్పందిస్తూ అన్ని రికార్డులు, ఎగ్జిబిట్లు, తీర్పు కాపీలు అన్నింటినీ రాష్టప్రతి ముందు ఉంచిన తరువాతనే ఆయన నిర్ణయం తీసుకొన్నారని సమాధానం ఇచ్చారు. విధానపరమైన జాప్యంతో కూడా రాష్టప్రతి తన క్షమాభిక్షను తిరస్కరించడానికి కారణమని సింగ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.