క్రైమ్/లీగల్

ముజఫర్‌పూర్ కేసు ఫిబ్రవరి 4కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బిహార్‌లోని ముజాఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. షెల్టర్ హోమ్‌లో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో బ్రజేష్ ఠాకూర్ సహా 18 మందిని ఢిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది. బ్రజేష్ ఠాకూర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అతడితోపాటు 18 మందిని జనవరి 20న కోర్టు దోషులుగా తేల్చింది. శిక్షలు మాత్రం ప్రకటించాల్సి ఉంది. కాగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట సెలవులో ఉన్నారు. దీంతో విచారణను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుదేష్ కమార్ ప్రకటించారు. ముజాఫర్‌పూర్ ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపులు, శారీరక చిత్రహింసలు జరిగినట్టు 2018 మే 26న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్(టీఐఎస్‌ఎస్) బయటపెట్టింది. టీఐఎస్‌ఎస్ నివేదికతో దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. నిందితులపై పోక్సో చట్టంలోని ఆరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. అలాగే ఐపీసీలోని అత్యాచారం, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపిన తరువాత కోర్టు 1546 పేజీల తీర్పును తీర్పును వెలువరించింది. ఠాకూర్‌పై 120బీ, 324,323, పోక్సో చట్టం కింద 21,75 సెక్షన్ల కింద నేరం రుజువైంది. అయితే విక్కీ అనే నిందితుడిని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. ముజాఫర్‌పూర్‌లోని శిశు అభివృద్ధి విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోసే రాణిని దోషిగా తేల్చారు. పోక్సో చట్టంలోని 21(1) కింద( బాలికలపై అఘాయిత్యాలు జరిగినా సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వలేదు. నిర్లక్ష్యం వహించారు)అని కేసు నమోదయింది. బ్రజేష్ ఠాకూర్‌కు గరిష్టంగా జీవిత ఖైదు పడుతుంది. అలాగే రోసే రాణికి ఆరునెలల జైలుశిక్ష పడొచ్చు. అయితే అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు.
అలాగే చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ దిలీప్ కమార్ వర్మ, జిల్లా చైల్ట్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్ యునిత్ రవి రోషన్, సీడబ్ల్యూసీ సభ్యుడు వికాస్ కుమార్, విజయ్ తివారీ, గుడ్డు పటేల్, కిషన్ కుమార్, రామానుజ్ ఠాకూర్‌పై నేరం రుజువైంది.
రామాశంకర్ సింగ్, డాక్టర్ అశ్వనీని కోర్టు దోషులుగా తేల్చింది. శ్రేష్ట ప్రవీణ్, ఇందు కూమారి, మినుదేవి, మంజు దేవి, చందాదేవి, నెహా కుమారి, హేమా మనిష్, కిరణ్ కుమారిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో 2019 మార్చి 30న చార్జిషీట్ దాఖలైంది. అప్పటి బిహార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మపైనా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆమె భర్తకు బ్రజేష్ ఠాకూర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శలు వచ్చిన నేపథ్యంలో మంజు వర్మ మంత్రి పదవికి రాజీనామా చేశారు.