క్రైమ్/లీగల్

హైకోర్టును ఆశ్రయించిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో సీబీఐ-ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ జరిపింది. జనవరి 31న వ్యక్తిగత హాజరుకావల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరగా, హైకోర్టులో విచారణ జరుగుతోందని కనుక సీబీఐ కోర్టుకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హాజరు అంశంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన విధులు నిర్వహించాల్సిన నేపథ్యంలో ప్రతి శుక్రవారం నాడు
అమరావతి నుండి హైదరాబాద్‌కు వచ్చి వ్యక్తిగతంగా హాజరుకావడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతుందని, కొంత వ్యయం ప్రభుత్వంపై కూడా పడుతోందని, అందువల్ల జగన్‌కు బదులు ఇతర ప్రతినిధులు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించిందని పేర్కొంటూ సీబీఐ న్యాయస్థాన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్టు జగన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయనే కారణంతో హాజరు మినహాయింపును నిరాకరించడం సరికాదని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. గతంలో ఈడీ, సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించిందని, దీంతో హైకోర్టును ఆశ్రయించినట్టు న్యాయవాదులు తెలిపారు.