క్రైమ్/లీగల్

రౌడీషీటర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఫిబ్రవరి 15: పరారిలో ఉన్న రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు వెళ్లిన గోల్కొండ పోలీసులను తోసేసి పారిపోయేందుకు యత్నించిన సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోజరిగింది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం విలేకర్లుకు వివరాలను వెల్ల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ అబ్దుల్లా బిన్ అలిపై గత కొన్ని నెలలుగా వారెంట్ పెండింగ్‌లో ఉంది. గత కొంత కాలంగా అబ్దుల్లా బిన్ పోలీసుల కనులు కప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మోతి మహల్ ప్రాంతంలో తన ఇంటిలో ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఏనిమిది గంటల ప్రాంతంలో అతని ఇంటికి వెళ్లి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అబ్దుల్లా బిన్ పోలీసులను చూసి, పోలీసులను తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే వెంబడించి పోలీసులు అబ్దుల్లాను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అబ్దుల్లా బిన్ అలీ 2007 సంవత్సరం నుంచి నేరాలు ప్రారంభించాడని 2010లో అతనిపై హత్య కేసుతో పాటు వివిధ కేసులు కూడా నమోదు అయ్యాయని సిఐ పేర్కొన్నారు. 2010లో అతనిపై పోలీసులు పీడియాక్టు కూడా పెట్టినట్లు ఓ సంవత్సరం పాటు జైలులో ఉన్నాడని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు కనిపించలేదని స్పష్టం చేశారు. అతనిపై తిరిగి దర్యాప్తు చేసి పీడి యాక్ట్ నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. అబ్దుల్లా బిన్‌ను గోల్కొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.