క్రైమ్/లీగల్

బజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 15: వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్ ఐటీ కారిడార్ పరిధిలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా విధ్వంసం సృష్టించిన ఐదుగురిపై మాదాపూర్ పోలీసు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విధ్వంసం సృష్టించిన ఐదుగురిని అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. నాగోతు అజిత్ సింగ్ (26) వదిత్య అర్జున్ (23) కొర్ర సంతోష్ (20) గుడుపు పవన కుమార్ (24) పొలారి తిరుపతి (22) వాలెంటెన్స్ డే రోజున గచ్చిబౌలి, కొత్తగూడ, మాదాపూర్, తదితర వాణ్యిజ సముదాయాలపై దాడులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. నార్బిట్ మాల్, బికనీర్, ఏఎంబీ, శరత్‌మాల్ తదితర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.